Asianet News TeluguAsianet News Telugu

పరిటాల రవి హత్యతో లింక్: భాను చేతిలో సూరి, మిగతా ఇద్దరు విచిత్రంగానే...

అనంతపురం జిల్లాలో 2005 జనవరి 24 అని ఎవరినైనా కదిపితే చాలు ఠక్కున చెప్తారు పరిటాల రవిని హత్యకు గురైన రోజు అని. అనంతపురం జిల్లాలో ఓ వెలుగువెలుగొందుతున్న పరిటాలను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు. జిల్లా పార్టీ సమావేశం అనంతరం కార్యాలయం బయట తన అనుచరులతో మాట్లాడుతుండగా ఆయనను కాల్చి చంపారు. ఈ హత్య అప్పట్లో దేశవ్యాప్తంగానే సంచలనం సృష్టించింది.

Three accused in Paritala murder case killed
Author
Ananthapuram, First Published Dec 18, 2018, 4:39 PM IST

అనంతపురం: అనంతపురం జిల్లాలో 2005 జనవరి 24 అని ఎవరినైనా కదిపితే చాలు ఠక్కున చెప్తారు పరిటాల రవిని హత్యకు గురైన రోజు అని. అనంతపురం జిల్లాలో ఓ వెలుగువెలుగొందుతున్న పరిటాలను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు. జిల్లా పార్టీ సమావేశం అనంతరం కార్యాలయం బయట తన అనుచరులతో మాట్లాడుతుండగా ఆయనను కాల్చి చంపారు. ఈ హత్య అప్పట్లో దేశవ్యాప్తంగానే సంచలనం సృష్టించింది.

నక్సలైట్ రాజకీయాల నుంచి వచ్చిన పరిటాల రవి స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో చేరి పెనుకొండ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.  

శ్రీరాములయ్య వంటి సినిమాల ద్వారా తెలుగు సినీ రంగంలో కూడా అడుగు పెట్టారు పరిటాల రవి. అయితే దివంగత సీఎం వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో హత్యకు గురయ్యారు పరిటాల రవి. 

పరిటాల రవిని తన ప్రత్యర్థి మద్దెలచెర్వు సూరియే హత్య చేయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు ఆనాడు సీబీఐ ఛార్జ్ షీట్ లో కూడా మద్దెల చెర్వు సూరి ప్రధాన నిందితుడు అంటూ పేర్కొంది కూడా. ఇకపోతే పరిటాల రవి హత్య కేసులో లింక్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు.  

పరిటాల హత్య కేసులో మద్దెలచెర్వు సూరి, షార్ప్ షూటర్ జూలకంటి శ్రీనివాస రెడ్డి అలియాస్ మొద్దు శీను, కాంగ్రెస్ నేత టి. కొండా రెడ్డిల ప్రధాన అనుమానితులుగా కేసు దర్యాప్తు ప్రారంభమైంది. ముగ్గురిని ప్రధాన నిందితులుగా సీబీఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది.

ఇదిలా ఉంటే సిబిఐ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో మొద్దు శీను ఓ ఛానెల్ లో ఇంటర్వ్యూ ఇవ్వడం కలకలం రేపింది. సూరి బావ కళ్లలో సంతోషం చూడడానికి తాను పరిటాల రవిని హత్య చేసినట్లు ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇంటర్యూ అనంతరం మళ్లీ మెుద్దు శీను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 

ఇదే కేసులో మరో నిందితుడిగా అనుమానిస్తున్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రేఖమయ్య పోలీసుల ముందు లొంగిపోవడంతో చాలా వరకు కేసు చిక్కు ముడి వీడింది. అతను చెప్పిన వివరాల ఆధారంగా హత్యకు వాడిన ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

జూబ్లీహిల్స్ బాంబు పేలుడు కేసులో ముద్దాయి అయిన మద్దెలచెర్వు సూరి పరిటాల రవి హత్యకు మొద్దు శీనును వినియోగించాడనే ఆరోపణలు వచ్చాయి. పరారీలో ఉన్న మొద్దు శీను విచిత్ర పరిస్థితిలో పోలీసులకు చిక్కాడు. 

హైదరాబాదు శివారులోని ఓ లాడ్జీలో సంభవించిన పేలుడులో గాయపడి ఆస్పత్రి పాలైన మొద్దు శీనును గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మొద్దు శీను జైలులో దారుణ హత్యకు గురయ్యాడు. 

ఆ తర్వాత టి. కొండారెడ్డి ప్రత్యర్థుల చేతిలో హతమయ్యాడు. మద్దెలచెర్వు సూరి తన అనుచరుడు భాను కిరణ్ చేతిలో మరణించాడు. ఇలా పరిటాల హత్య కేసులో నిందితులు అంతా దారుణ హత్యకు గురయ్యారు. ఇక సూరిని హత్య చేసిన భానుకిరణ్ జీవిత ఖైదుతో ప్రజాజీవితాన్నే కోల్పోయాడు. 

మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో ఎనిమిది మందికి అనంతపురం జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. పరిటాల రవి హత్య కేసులో 133 మంది సాక్షులను సీబీఐ విచారించింది. వారిలో 16 యందిపి నిందితులుగా పేర్కొంది.  

అయితే అనంతపురం జిల్లా కోర్టు మొత్తం పదహారు మందిలో ఎనిమిది మందిని దోషులుగా ప్రకటించింది. నలుగురిపై కేసు కొట్టివేసింది. ఈ కేసులో మరో ముగ్గురు ప్రధాన నిందితులు అయిన మద్దెలచెర్వు సూరి, మొద్దు శీను, తరగకుండ కొండారెడ్డిలు దారుణ హత్యకు గురయ్యారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే వారు హత్యకు గురవ్వడం గమనార్హం. 

ఈ వార్తలు కూడా చదవండి

మా అమ్మకు ఒక్కడినే కొడుకుని, శిక్ష తగ్గించండి: భానుకిరణ్

సూరి హత్యకేసు:భానుకిరణకు జీవిత ఖైదు, నలుగురికి విముక్తి

సూరి హత్య కేసు: నమ్మినబంటే చంపేశాడన్న భానుమతి

భాను కిరణ్ గురించి మద్దెలచెర్వు సూరి భార్య ఏమన్నారంటే...

సూరి హత్యకేసు:భానుకిరణ్ కు జీవిత ఖైదు, నలుగురికి విముక్తి

భానుకిరణ్‌కు జీవిత ఖైదు:భానుమతి అసంతృప్తి

 

Follow Us:
Download App:
  • android
  • ios