సూరి హత్యకేసు:భానుకిరణ్ కు జీవిత ఖైదు, నలుగురికి విముక్తి

ఫ్యాక్షనిస్టు, పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దెలచెర్వు సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ సూరి హత్య కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పునిచ్చింది. కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న సూరి ప్రధాన అనుచరుడు భానుకిరణ్ ను దోషిగా తేల్చింది. భానుకిరణ్ తోపాటు ఆయనకు సహకరించిన మన్మోహన్ సింగ్ అనే వ్యక్తికి 5ఏళ్లు జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. 

maddelacheruvu suri murder case: bhanu sentenced life term

హైదరాబాద్:  ఫ్యాక్షనిస్టు, పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దెలచెర్వు సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ సూరి హత్య కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పునిచ్చింది. కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న సూరి ప్రధాన అనుచరుడు భానుకిరణ్ ను దోషిగా తేల్చింది. భానుకిరణ్ తోపాటు ఆయనకు సహకరించిన మన్మోహన్ సింగ్ అనే వ్యక్తికి 5ఏళ్లు జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది.

నిందితుడు భానుకిరణ్ కు యావజ్జీవ శిక్ష, రూ.20 వేలు జరిమానా విధించింది. అలాగే ఆర్మ్స్ యాక్ట్ కేసులో భాను కిరణ్ కు మరో పదేళ్లు జైలు శిక్ష విధించింది. ఇకపోతే భానుకిరణ్ కు సహకరించిన మన్మోహన్ సింగ్ కు 5ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.5వేలు జరిమానా విధించింది. అలాగే ఆర్మ్స్ యాక్ట్ లో మరో 5ఏళ్లు జైలు శిక్ష విధించింది. మిగిలిన నలుగురిపై ఉన్న కేసులను కొట్టివేసింది. వారిని నిర్దోషిలుగా పరిగణిస్తూ తీర్పు వెల్లడించింది. 

ఇకపోతే 2011 జనవరి 3న హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీ సమీపంలోని నవోదయ కాలనీలో మద్దెల  చెర్వు  సూరి హత్య జరిగింది. ఈ హత్య సూరి ప్రధాన అనుచరుడు భానుకిరణే పాయింట్ బ్లాంక్ లో మద్దెల చెరువు సూరిని హత్య చేశారడని పోలీసులు అనుమానించారు. ఈ కేసులో భానుకిరణ్ తోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. 

హత్య జరిగిన అనంతరం భానుకిరణ్ పరారయ్యాడు. దాదాపు 14 నెలల తర్వాత అంటే 2012 ఏప్రిల్ 12న అంటే పోలీసులకు చిక్కాడు భానుకిరణ్. మెుదట సూరి హత్య కేసును నమోదు చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు ఆ తర్వాత కేసును సీసీఎస్ పోలీసులకు బదిలీ చేశారు. 

సీసీఎస్ నుంచి కేసు దర్యాప్తును అప్పటి ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. సిఐడీ విచారణకు వెళ్ళడంతో కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ఈ కేసు విచారణ చేపట్టిన సీఐడీ దాదాపు 90 మంది సాక్షులను విచారించారు. విచారణ అనంతరం మద్దెలచెర్వు సూరిని అనుచరుడు భానుకిరణ్ పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపాడని సిఐడీ తన చార్జ్ షీట్ లో పేర్కొంది. 

ఈ కేసులో సూరి డ్రైవర్ మధు మోహన్ సాక్ష్యమే కీలకంగా మారింది. తాము జూబ్లీహిల్స్ నుంచి సనత్ నగర్ వెళ్తూ మార్గ మధ్యలో ఒక లాయర్ ను కలిశామని అక్కడ నుంచి స్కోడా కారులో సూరి, తాను, భాను కిరణ్ కలిసి బయలు దేరినట్లు పోలీసుల వాంగ్మూలంలో చెప్పాడు. తాను డ్రైవింగ్ చేస్తుండగా తన పక్కన మద్దెలచెర్వు సూరి కూర్చున్నాడని వెనుక మాత్రం భానుకిరణ్ కూర్చున్నట్లు సిఐడీ అధికారులకు తెలిపాడు. 

జూబ్లీహిల్స్ సమీపంలోని నవోదయ కాలనీకి చేరుకుంటుండగా ఒక స్పీడ్ బ్రేకర్ రావడంతో కారును స్లో చెయ్యగా ఒక్కసారిగా కారులో  పెద్ద శబ్ధం వచ్చిందని తీరా చూస్తే సూరి సిగరెట్ కాలుస్తూ తన భుజాలపై వాలిపోయాడని అయితే ఆ సమయంలో భాను కిరణ్ అటాక్ అటాక్ అంటూ అరుస్తూ కారు దిగి పారిపోయాడని వాంగ్మూలంలో తెలిపాడు మధుమోహన్. 

 అయితే వెంటనే రక్తపు మడుగులో ఉన్న సూరిని అపోలో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. హత్య అనంతరం తాను ఎన్నిసార్లు భానుకిరణ్ కు ఫోన్ చేసినా స్పందించలేదని తెలిపాడు. సూరిపై పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరిపినట్లు ఫోరెన్సిక్ నివేదిక కూడా తేల్చింది. అయితే ఇంతలా పాయింట్ బ్లాంక్ లో షూట్ చేసే అవకాశం ఒక్క భాను కిరణ్ కు మాత్రమే ఉందని సీఐడీ ఆరోపిస్తోంది. 

ఇకపోతే 14 నెలల అనంతరం పోలీసులకు దొరికిన భాను కిరణ్ ఆనాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఆరేళ్ల కనీసం బెయిల్ కు కూడా ప్రయత్నించలేదు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు. విచారణకు మాత్రం కోర్టుకు హాజరవుతున్నాడు. 

అయితే ఈ కేసులో భానుకిరణ్ ను ప్రధాన నిందితుడిగా హైకోర్టు తీర్పునిచ్చింది. నాంపల్లి తీర్పుపై మద్దెల చెర్వు సూరి భార్య గంగుల భానుమతి హర్షం వ్యక్తం చేశారు. తన కుటుంబంలో శోకం నింపిన భానుకిరణ్ కు కోర్టు తగిన శిక్ష విధించిందని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.   
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios