హైదరాబాద్: మద్దెల చెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు సూరి అనుచరుడు భానుకిరణ్ తనకు శిక్ష తగ్గించాలంటూ నాంపల్లి కోర్టులో కోరాడు. సూరి హత్య కేసులో నాంపల్లి కోర్టు భానుకిరణ్ కు జీవిత ఖైదుతోపాటు రూ.20వేలు జరిమానా విధించింది. అలాగే ఆర్మ్స్ యాక్ట్ కేసులో మరో పదేళ్లు జైలు శిక్ష విధించింది. 

ఈ నేపథ్యంలో భానుకిరణ్ కోర్టును తన శిక్షా కాలం తగ్గించాల్సిందిగా ప్రాధేయపడ్డాడు. ఇప్పటి వరకు దాదాపుగా ఆరేళ్లు జైల్లో ఉన్న భానుకిరణ్ శిక్ష పడిన తర్వాత తొలిసారిగా నోరు విప్పాడు. 2012 ఏప్రిల్ 12న పోలీసులకు చిక్కిన భాను కిరణ్ ఆనాటి నుంచి నేటి వరకు కనీసం బెయిల్ కు కూడా అప్లై చెయ్యలేదు. 

అయితే నాంపల్లి కోర్టు తీర్పు అనంతరం భాను తొలిసారిగా స్పందించాడు. తన తల్లి అనారోగ్యంతో ఉందని ఆమెను యోగక్షేమాలు చూసుకునేందుకు ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశాడు. తన తల్లికి తాను ఒక్కడినే కుమారుడినని చెప్పుకొచ్చాడు. తానే తన కటుంబాన్నిపోషించాల్సిన పరిస్థితి అని దయచేసి తన శిక్ష కాలం తగ్గించాలని జడ్జిని భాను కిరణ్ కోరాడు.

2011 జనవరి 3న హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీ సమీపంలోని నవోదయ కాలనీలో మద్దెల  చెర్వు  సూరి హత్య జరిగింది. ఈ హత్య సూరి ప్రధాన అనుచరుడు భానుకిరణే పాయింట్ బ్లాంక్ లో షూట్ చేసి మద్దెల చెరువు సూరిని హత్య చేశాడు. 

ఈ కేసులో నాంపల్లి కోర్టు భానుకిరణ్ ను దోషిగా నిర్ధారించింది. అతనికి జీవిత ఖైదుతోపాటు రూ.20 వేలు జరిమానా విధించింది. అలాగే ఆర్మ్స్ యాక్ట్ కేసులో మరో పదేళ్లు జైలు శిక్ష విధించింది. 

ఇకపోతే ఇదే కేసులో భానుకిరణ్ కు సహకరించిన మన్మోహన్ సింగ్ అనే వ్యక్తికి 5ఏళ్లు జైలు శిక్షతోపాటు రూ.5వేలు జరిమానా విధించింది. అలాగే ఆర్మ్స్ యాక్ట్ కేసులో మరో ఐదేళ్లు ఫైన్ విధించింది. మిగిలిన నలుగురికి విముక్తి కల్పిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 
 

ఈ వార్తలు కూడా చదవండి

సూరి హత్యకేసు:భానుకిరణకు జీవిత ఖైదు, నలుగురికి విముక్తి

సూరి హత్య కేసు: నమ్మినబంటే చంపేశాడన్న భానుమతి

భాను కిరణ్ గురించి మద్దెలచెర్వు సూరి భార్య ఏమన్నారంటే...

సూరి హత్యకేసు:భానుకిరణ్ కు జీవిత ఖైదు, నలుగురికి విముక్తి

భానుకిరణ్‌కు జీవిత ఖైదు:భానుమతి అసంతృప్తి