హైదరాబాద్:  మద్దెలచెర్వు సూరి హత్య కేసులో  ప్రధాన నిందితుడు భాను కిరణ్‌కు  పడిన శిక్ష పట్ల సూరి భార్య భానుమతి  తీవ్ర  అసంతృప్తిని వ్యక్తం చేశారు.

2011 జనవరి3వ తేదీన యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద  కారులోనే సూరిని భానుకిరణ్ హత్య చేశాడు.ఈ కేసును ఏడేళ్ల ఏళ్ల పాటు కోర్టు విచారించింది.ఈ కేసులో సూరి ప్రధాన అనుచరుడు భానుకిరణ్‌కు యావజ్జీవ శిక్షను విధిస్తూ కోర్టు ఇవాళ తీర్పు చెప్పింది.

భానుకిరణ్ కు పడిన శిక్ష పట్ల  భానుమతి సంతృప్తి చెందలేదు  భానుకు ఉరిశిక్ష పడితే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. భానుకు ఉరి శిక్ష పడితే సూరి ఆత్మ శాంతించేదని ఆమె అభిప్రాయపడ్డారు. డబ్బు పిచ్చితోనే సూరిని భాను హత్య చేశాడని  ఆమె ఆరోపించారు.

తమ కుటుంబంలో భాను ఆరని చిచ్చును రేపాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.కోర్టు తీర్పు సంతృప్తికరంగా లేదని భానుమతి అభిప్రాయపడ్డారు. తన భర్తను చంపిన భానుకిరణ్ కు కోర్టు విధించిన శిక్ష సరిపోలేదన్నారు.

సంబంధిత వార్తలు

భాను కిరణ్ గురించి మద్దెలచెర్వు సూరి భార్య ఏమన్నారంటే...

సూరి హత్యకేసు:భానుకిరణ్ కు జీవిత ఖైదు, నలుగురికి విముక్తి