Asianet News TeluguAsianet News Telugu

సూరి హత్య కేసు: నమ్మినబంటే చంపేశాడన్న భానుమతి

 పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడు మద్దెల చెరువు సూరి హత్య కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పునిచ్చింది. హత్య కేసులో భానుకిరణ్ ప్రధాన నిందితుడు అని సిఐడీ ఆరోపణలకు తగిన సాక్ష్యాలు చూపడంలో సక్సెస్ అయ్యిందని న్యాయవాదులు తెలిపారు.

maddela cheruvu suri murder case
Author
Hyderabad, First Published Dec 18, 2018, 1:28 PM IST

హైదరాబాద్: పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడు మద్దెల చెరువు సూరి హత్య కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పునిచ్చింది. హత్య కేసులో భానుకిరణ్ ప్రధాన నిందితుడు అని సిఐడీ ఆరోపణలకు తగిన సాక్ష్యాలు చూపడంలో సక్సెస్ అయ్యిందని న్యాయవాదులు తెలిపారు.

ఏడేళ్లపాటు కేసు విచారణ అనంతరం నాంపల్లి కోర్టు తీర్పు వెలువరిస్తున్న నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందా అన్న సందేహాలను పటాపంచెలు చేసింది. భానుకిరణ్ ను ప్రధాన నిందితుడిగా నిర్ధారించింది. దీంతో అతనికి నాంపల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది.  
 
మద్దెల చెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు సూరి రైట్ హ్యాండ్ భానుకిరణ్ అని సిఐడీ మెుదటి నుంచి ఆరోపిస్తోంది. తన ఛార్జ్ షీట్ లో సైతం పేర్కొంది. సిఐడీ ఆరోపించిందే నిజమైంది. మెుదటి నుంచి గంగుల భానుమతి చెప్పింది కూడా నిజమైంది. మద్దెల చెర్వు సూరిని బలితీసుకుంది నమ్మిన బంటు భానుకిరణే అని.   

ఇకపోతే ఈ కేసులో మద్దెల చెరువు సూరి హత్య నమ్మక ద్రోహంతో జరిగింది. అనంతపురం టీడీపీ నేత మాజీమంత్రి పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మద్దెల చెర్వు సూరి హత్య గావించబడటానికి 8 నెలల క్రితం బెయిల్ పై వచ్చాడు. 

అయితే కేసు విచారణలో భాగంగా చంచల్ గూడ జైల్లో ఉన్న మద్దెల చెర్వు సూరికి భానుకిరణ్ పరిచయమయ్యాడు. ఇద్దరు జైలు నుంచి విడుదలైన తర్వాత రాయలసీమలో విపరీతమైన సెటిల్మెంట్లు చేసేవారని ప్రచారం. సూరికి అన్నివైపులా భానుకిరణ్ అండదండగా నిలిచాడని ప్రచారం. 

ఇకపోతే ఇద్దరు కలిసి సినీ ఇండస్ట్రీని సైతం వదల్లేదని సినీ ఇండస్ట్రీలో కూడా వేలుపెట్టారని ప్రచారం జరిగింది. అంతేకాదు అనంతపురం జిల్లాలో ఓ ప్రాజెక్టు విషయంలో కూడా భారీగా డబ్బులు తీసుకున్నారంటూ ఇప్పటికి ప్రచారం ఉంది. 

మద్దెలచెరువు సూరి తన సెటిల్మెంట్స్ వందల కోట్లాది రూపాయలు సంపాదించాడని ఆ సొమ్ముకు భానుకిరణ్ ను బినామీగా పెట్టాడు. అయితే ఆర్థిక లావా దేవీల విషయంలో ఇద్దరి మధ్య పెద్ద ఎత్తన వివాదాలు చోటు చేసుకున్నాయి. 

ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు యుద్ధానికి కాలుదువ్వారు. అయితే ఈ గొడవలో భాను కిరణ్ ను అంతమెుందించేందుకు మద్దెల చెరువు సూరి ప్రయత్నించాడని అయితే ఆ విషయం తెలుసుకున్న భానుకిరణ్ మద్దెల చెరువు సూరి హత్యకు ప్లాన్ చేసి అంతమెుందించాడు. 

ఇకపోతే మద్దెల చెర్వు సూరి పేరు చెప్పి భాను కిరణ్ సెటిల్మెంట్లకు పాల్పడ్డాడని సూరి భార్య గంగుల భానుమతి తెలిపింది. దాదాపు 700 కోట్ల రూపాయల మేర భానుకిరణ్ సూరిపేరుతో సెటిల్మెంట్లు చేశారని ఆరోపించింది. 

తన భర్త సెటిల్మెంట్ల జోలికి వెళ్లలేదని, కేవలం పరిటాల రవి హత్య కేసుపైనే ఆలోచించేవారని స్పష్టం చేసింది. అయితే ఈ హత్య వెనుక పరిటాల రవి కుటుంబ సభ్యులు ఉన్నారని వాళ్లే తప్ప తమకు ఎలాంటి శత్రువులు లేరని ఆమె తెలిపింది. 

మెుత్తానికి సూరిని నమ్మిన వ్యక్తే మట్టుబెట్టాడు. జైల్లో పరిచయం అయిన వ్యక్తిని బయటకు వచ్చిన తర్వాత తన వెంటపెట్టుకుని తిప్పుకోవడం, అన్ని అంశాల్లో కీలక భాగస్వామి చెయ్యడంతో భానుకిరణ్ తిరుగబడటం మెుదలుపెట్టాడని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. 

అంతేకాదు డబ్బు అంటే భానుకిరణ్ కు విపరీతమైన పిచ్చి అని కూడా చెప్పుకొచ్చారు. నమ్మకంగా ఉంటాడనుకున్న వ్యక్తి ప్రత్యర్థులతో చేతులు కలిపి తన భర్తను మట్టుబెట్టాడని నమ్మక ద్రోహం చేసిన భానుకిరణ్ కు తగిన శాస్తి జరిగిందంటున్నారు.  

ఈ వార్తలు కూడా చదవండి

సూరి హత్యకేసు:భానుకిరణకు జీవిత ఖైదు, నలుగురికి విముక్తి

Follow Us:
Download App:
  • android
  • ios