గుంటూరు: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. టీటీడీ బోర్డుని సీబీఐ ఛార్జ్ షీట్ చిట్టాలా చేశారని ఆరోపించారు. 36 మందికి దేవుడు సొమ్ము పంచిపెట్టే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. 

టీటీడీ జంబో బోర్డు అంతా జగన్-కేసీఆర్ బినామీలేనని చెప్పుకొచ్చారు. జగన్- కేసీఆర్ బినామీలకు పదవులను కట్టబెట్టి భక్తుల మనోభోవాలు దెబ్బతీశారని అనురాధా విమర్శించారు. టీటీడీ జంబో బోర్డు క్విడ్ ప్రోకో చిట్టా అంటూ ధ్వజమెత్తారు. 

టీటీడీ బోర్డు డెకాయిట్‌ల బోర్డులా ఉందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులైన శేఖర్‌రెడ్డిపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం బోర్డు సభ్యుడిగా శేఖర్ రెడ్డిని నియనించినప్పుడు అతనిపై ఏ కేసు లేదన్నారు. ఈడీ కేసు పెట్టగానే శేఖర్‌రెడ్డిని తొలగించినట్లు చెప్పుకొచ్చారు. 

శేఖర్ రెడ్డిపై గతంలో రూ.100 కోట్లు కుంభకోణమని ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు మళ్లీ బోర్డు సభ్యుడిగా ఎలా నియమించారని అనురాధా ప్రశ్నించారు. స్థానికులకు 75శాతం అని చెప్పి టీటీడీలో ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని నిలదీశారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం టీటీడీని వాడుకోవటాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు అనురాధా స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

అమరావతిలో శ్రీవారి ఆలయ పరిధి తగ్గింపు: టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

బోర్డు నుంచి తొలగించడం బాధేసింది, నా నిజాయితీని జగన్ గుర్తించారు: శేఖర్ రెడ్డి

టీటీడీ ప్రత్యేక అహ్వానితుల్లో శేఖర్ రెడ్డి: జగన్ సెల్ఫ్ గోల్

టీటీడీ సభ్యుల ప్రమాణ స్వీకారం: 28మందితో కొలువుదీరిన పాలకమండలి

టీటీడీ బోర్డులో ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులు: ఉత్తర్వులు జారీ

28 మందితో టీటీడీ కొత్త పాలకమండలి: సభ్యులు వీరే

సుబ్రహ్మణ్యస్వామి పిల్ తోనే విముక్తి, ఈవో బాధ వర్ణనాతీతం :టీటీడీపై ఐవైఆర్

టీటీడీ బోర్డు మెంబర్ రేసులో లేను: స్పష్టం చేసిన ద్వారంపూడి

టీటీడీ పాలకమండలిపై జగన్ కసరత్తు: పరిశీలనలో కేసీఆర్ మిత్రుడు