తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం శ్రీవారి ఆలయంలో ఘనంగా జరిగింది. పాలక మండలి సభ్యుల చేత టీటీడీ జేఈవో బసంత్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. 

తొలుత టీటీడీ పాలక మండలి సభ్యులుగా శ్రీనివాస్, పార్థసారథి, యూవీ రమణమూర్తిరాజు, జూపల్లి రామేశ్వరరావు, మురళీకృష్ణ, నాదెండ్ల సుబ్బారావులు ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీలో తొలిసారిగా పెద్ద సంఖ్యలో పాలక మండలిని ఏర్పాటు చేశారు. 

ఎక్స్‌ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 28 మందికి పాలకమండలిలో ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఏపీ నుంచి 8 మంది, తెలంగాణ నుంచి ఏడుగురు, తమిళనాడు నుంచి నలుగురు, కర్నాటక నుంచి ముగ్గురు, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి టీటీడీ పాలకమండలిలో అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. 

ఈ వార్తలు కూడా చదవండి

28 మందితో టీటీడీ కొత్త పాలకమండలి: సభ్యులు వీరే

టీటీడీ ప్రత్యేక అహ్వానితుల్లో శేఖర్ రెడ్డి: జగన్ సెల్ఫ్ గోల్

టీటీడీ బోర్డులో ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులు: ఉత్తర్వులు జారీ

28 మందితో టీటీడీ కొత్త పాలకమండలి: సభ్యులు వీరే

సుబ్రహ్మణ్యస్వామి పిల్ తోనే విముక్తి, ఈవో బాధ వర్ణనాతీతం :టీటీడీపై ఐవైఆర్

టీటీడీ బోర్డు మెంబర్ రేసులో లేను: స్పష్టం చేసిన ద్వారంపూడి

టీటీడీ పాలకమండలిపై జగన్ కసరత్తు: పరిశీలనలో కేసీఆర్ మిత్రుడు