తిరుమల: తప్పుడు ఆరోపణలతో గతంలో తనను టీటీడీ పాలక మండలి నుంచి తొలగించారని ఆరోపించారు టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడు శేఖర్ రెడ్డి. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైన ఆరోపణలేనని కొట్టి పారేశారు. 

తనకంటే నిజాయితీ కలిగిన భక్తుడు ఎవరూ ఉండరన్నారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు శేఖర్ రెడ్డి. గత 20ఏళ్లుగా స్వామివారికి సేవలో తరిస్తున్నట్లు తెలిపారు. దేవుడికి ఏం చేస్తున్నామో అనేది ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని అయితే ప్రస్తుతం చెప్పాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. 

గత ఆరేళ్లుగా శ్రీవారికి, పద్మావతి అమ్మవార్లకు ప్రతీరోజు బెంగళూరు నుంచి సంపంగి పూలు అందజేస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మతీర్థానికి బంగారు బిందెను స్వామివార్లకు బహుకరించినట్లు తెలిపారు. తన ఇంట్లో అధికంగా డబ్బులు ఉన్నాయంటూ ఆరోపణలతో తనను బోర్డు నుంచి తొలగించారని స్పష్టం చేశారు. 

ఎస్ఆర్ఎస్ మైనింగ్ లో తాను భాగస్వామిగా ఉన్నానని చెప్పుకొచ్చారు. నోట్ల రద్దు సమయంలో తన ఇంట్లో ఇన్ కం ట్యాక్స్ దాడులు చేశారని ఆనాడు కేవలం రూ.12లక్షలు మాత్రమే దొరికిందన్నారు. కానీ తన నివాసంలో 100 కోట్లు దొరికిందని తనను అకారణంగా బోర్డు నుంచి తొలగించారని ఆరోపించారు. 

బోర్డు నుంచి తనను తప్పించడంపై చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చారు శేఖర్ రెడ్డి. అయితే తన నిజాయితీని గుర్తించిన సీఎం జగన్ తనకు మరోసారి అవకాశం కల్పించారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు శేఖర్ రెడ్డి. 
 

ఈ వార్తలు కూడా చదవండి

టీటీడీ ప్రత్యేక అహ్వానితుల్లో శేఖర్ రెడ్డి: జగన్ సెల్ఫ్ గోల్

టీటీడీ సభ్యుల ప్రమాణ స్వీకారం: 28మందితో కొలువుదీరిన పాలకమండలి

టీటీడీ బోర్డులో ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులు: ఉత్తర్వులు జారీ

28 మందితో టీటీడీ కొత్త పాలకమండలి: సభ్యులు వీరే

సుబ్రహ్మణ్యస్వామి పిల్ తోనే విముక్తి, ఈవో బాధ వర్ణనాతీతం :టీటీడీపై ఐవైఆర్

టీటీడీ బోర్డు మెంబర్ రేసులో లేను: స్పష్టం చేసిన ద్వారంపూడి

టీటీడీ పాలకమండలిపై జగన్ కసరత్తు: పరిశీలనలో కేసీఆర్ మిత్రుడు