Asianet News TeluguAsianet News Telugu

సుబ్రహ్మణ్యస్వామి పిల్ తోనే విముక్తి, ఈవో బాధ వర్ణనాతీతం :టీటీడీపై ఐవైఆర్

29మంది ఉన్న బోర్డును నిర్వహించడంలో ఈవో పడే బాధ వర్ణనాతీతమంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఇకపోతే భక్తి భావాలు కలిగిన వాళ్ళు బోర్డులో ఉండాలంటే అది ఏ నాడూ జరగలేదని విమర్శించారు. 

ex cs, bjp leader iyr krishna rao sensational comments on ttd board
Author
Amaravathi, First Published Sep 19, 2019, 3:20 PM IST

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల సంఖ్య పెంచడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు. ఎన్నడూ లేనివిధంగా 29 మంది సభ్యులతో బోర్డు ఏర్పాటు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. 

29మంది ఉన్న బోర్డును నిర్వహించడంలో ఈవో పడే బాధ వర్ణనాతీతమంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఇకపోతే భక్తి భావాలు కలిగిన వాళ్ళు బోర్డులో ఉండాలంటే అది ఏ నాడూ జరగలేదని విమర్శించారు. 

ఇప్పుడైనా, భవిష్యత్తులోనైనా జరుగుతుందన్న ఆశ కూడా లేదని చెప్పుకొచ్చారు. రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ప్రజా ప్రయోజన వ్యాజ్యంతోనైనా దేవాలయాలకు ప్రభుత్వం నుంచి విముక్తి వస్తేనే ముక్తి ఉంటుందన్నారు.
 
ఈ సందర్భంగా టీడీపీపైనా సెటైర్లు వేశారు ఐవైఆర్ కృష్ణారావు. టీటీడీ బోర్డుపై తానేమంటానన్న ఆసక్తి తెలుగు తమ్ముళ్లలో నెలకొందని వ్యాఖ్యానించారు. టీటీడీ వ్యవస్థలో నిర్ణయాలు ఈఓ, చైర్మన్, ముఖ్యమంత్రి మధ్య నడుస్తాయన్న ఆయన బోర్డు సభ్యులు దర్శనాలకు మాత్రమే చేసుకుంటారన్నారు.

ఈ సందర్భంగా గతంలో తాను ఈవోగా పనిచేసిన అనుభవాలు చెప్తున్నట్లు చెప్పుకొచ్చారు. 14 మంది సభ్యులు ఉన్న బోర్డును మేనేజ్ చేయటమే తనకు ఆ రోజుల్లో పెద్ద సమస్యగా మారిందన్నారు. అయితే ప్రస్తుతం 29 మంది సభ్యులు ఉన్న నేపథ్యంలో బోర్డును మేనేజ్ చేయడం కత్తిమీద సామేనన్నారు ఐవైఆర్ కృష్ణారావు. 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios