సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో నిర్మించనున్న శ్రీవారి ఆలయ పరిధిని తగ్గించడంతో పాటు బడ్జెట్‌ను రూ. 150 కోట్ల నుంచి రూ.36 కోట్లకు కుదించారు.

టీటీడీ బోర్డు నిర్ణయాలు:
* అమరావతిలో శ్రీవారి ఆలయ పరిధి తగ్గింపు
* తిరుపతిలోని అవిలాల చెరువు అభివృద్ధికి రూ.48 కోట్లు కేటాయింపు
* తిరుపతిలో గరుడ వారధి నిర్మాణం కొనసాగింపుకు తీర్మానం
* టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కమిటీ
* టీటీడీ ముఖ్య గణాంక అధికారిగా రవిప్రసాద్‌కు నియామకం