మాజీ మంత్రి, వైసీపీ అధినేత జగన్ బాబాయి వైఎస్ వివేకా శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పటికే ఈయన మృతిపై చాలా అనుమానాలు వ్యక్తమౌతుండగా.. తాజాగా.. టీడీపీ ఎంపీ సీఎం రమేష్.. కొత్త అనుమానాలను వ్యక్తం చేశారు.

 వైఎస్ వివేకా మరణం సహజ మరణంలా లేదని, అనుమానాస్పద మృతిగా కనిపిస్తోందని  సీఎం రమేష్ అభిప్రాయపడ్డారు. వివేకా మృతిపై విచారణ జరిపి నిజాలు వెలికితీయాలని ఆయన అభిప్రాయపడ్డారు. వివేకా మృతిపై ఎన్‌ఐఏ, సీబీఐ విచారణ జరపాలని జగన్‌ ఎందుకు అడగడం లేదని ఎంపీ సీఎం రమేష్‌ ప్రశ్నించారు. జగన్‌కు నమ్మకమైన తెలంగాణ పోలీసులతో విచారణ జరిపించుకోవాలని, వివేకా మరణాన్ని రాజకీయం చేస్తున్నారని ఎంపీ సీఎం రమేష్‌ వైసీపీపై మండిపడ్డారు.

కాగా.. ఈ రోజు ఉదయం బాత్రూమ్ లో వైఎస్ వివేకా అచేతన స్థితిలో పడి ఉన్నారు. గమనించి పీఏ కృష్ణారెడ్డి కుటుంబసభ్యులకు, పోలీసులకు ఫిర్యాదు  చేశారు. మొదట గుండె నొప్పితో మృతి  చెందారని అందరూ భావించారు. అయితే.. తర్వాత పీఎ చెప్పిన విషయాలు, అక్కడి దృశ్యాలు చేసి.. హత్య జరిగి ఉండొచ్చేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. 

related news

వైఎస్ వివేకానందరెడ్డి మృతి: సిట్ ఏర్పాటు చేసిన సర్కార్

ఎన్నికలను ఎదుర్కోలేకే వివేక మరణంపై రాజకీయం: ఆదినారాయణరెడ్డి

తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?

నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

వివేకా బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ

వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి

వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం

నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం