విజయవాడ: కృష్ణా జిల్లా బాపులపాడులో బ్యూటీషీయన్ పిల్లి పద్మను పథకం ప్రకారంగా ప్రియుడు నూతన్ కుమార్ దారుణంగా చిత్ర హింసలు పెట్టాడు. బాధితురాలికి మత్తు మందు ఇంజక్షన్ ఇచ్చి కత్తితో దాడికి దిగినట్టు పోలీసులు గుర్తించారు.

కృష్ణా జిల్లా బాపులపాడులలోని పిల్లి పద్మ భర్తతో విడిపోయింది. 24 ఏళ్ల క్రితం ఆమెకు మేనమామతో వివాహమైంది. భర్తతో విబేధాల కారణంగా ఆమె అతడితో దూరంగా ఉంటుంది. భర్తపై కేసు కూడ పెట్టింది. అయితే ఇరు వర్గాలు కూడ రాజీ పడ్డారు. పద్మకు ఇద్దరు కూతుళ్లు. ఓ కూతురు తన తల్లి వద్ద, మరో కూతురు తండ్రి వద్ద ఉంటున్నారు. 

పద్మ మాత్రం నాలుగేళ్లుగా ఏలూరుకు చెందిన నూతన్ కుమార్ తో వివాహేతర సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. ఆగష్టు 6 వ తేదీ నుండి వీరిద్దరూ కూడ బాపులపాడులో ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు.

పద్మను ప్రియుడు నూతన్ కుమార్ చిత్ర హింసలు పెట్టారని అనుమానిస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పద్మను వివస్త్రను చేసి శరీరంపై తీవ్రంగా గాయపర్చినట్టుగా వైద్యులు చెబుతున్నారు.

పద్మను చిత్ర హింసలు పెట్టే ముందు ఆమెకు మత్తు మందు ఇచ్చినట్టు గుర్తించారు. ఇంజక్షన్ ద్వారా మత్తును ఆమె శరీరంలోకి పంపినట్టు వైద్యులు గుర్తించారు. పద్మ నోటీకి ప్లాస్టర్ వేయడం... ఆమె కాళ్లు, చేతులు కట్టేసి శరీరంపై కత్తితో గాట్లు పెట్టినట్టు వైద్యులు గుర్తించారు.

బాధితురాలు అరవకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే మత్తు ఇంజక్షన్ ఇచ్చినట్టు వైద్యులు భావిస్తున్నారు. అంతేకాదు ఒకవేళ స్పృహాలోకి వచ్చినా అరవకుండా ఉండేందుకు గాను నోటికి ప్లాస్టర్ వేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.

మరో వైపు నూతన్ కుమార్ ఆచూకీ లేకపోవడంతో ఈ ఘటనకు అతనే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మరో వైపు తీవ్ర గాయాలతో పద్మ కోమాలో ఉంది. ఆమెకు వైద్యులు చికిత్స నిర్వహిస్తున్నారు. ఆమె కోలుకొని నోరు విప్పితే నిందితులు ఎవరనేది తేలే అవకాశం ఉంది. 

గురువారం నాడు నూతన్ కుమార్ ,పద్మ మధ్య గొడవ జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నాం వరకు నూతన్ కుమార్ బండి కూడ ఇంటి వద్దే ఉంది. అయితే మధ్యాహ్నం నుండి నూతన్ కుమార్ ఆచూకీ లేకుండా పోయాడు. 

అంతేకాదు అతి సెల్‌ఫోన్ కూడ స్విచ్ఛాఫ్ చేసి ఉంది.నూతన్ కుమార్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పద్మపై ఇంత క్రూరంగా ఎందుకు దాడి చేశారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 

ఈ వార్త చదవండి

అఫైర్: కాళ్లూ చేతులూ కట్టేసి బ్యుటిషియన్ పై దాడి