బాలికపై ప్రియుడు రేప్.. ఏడాది పాటు ప్రియురాలిని స్నేహితులకి పంచిన ప్రియుడు

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 7, Sep 2018, 9:11 AM IST
minor girl gang raped by lover and their friends
Highlights

మైనర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి.. ఆమెతో తన కోరిక తీర్చుకుని  అనంతరం ప్రియురాలిని స్నేహితులకు పంచాడు కేటుగాడు. గుంటూరు స్వర్ణభారతీనగర్‌‌కు చెందిన బాలిక నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. 

మైనర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి.. ఆమెతో తన కోరిక తీర్చుకుని  అనంతరం ప్రియురాలిని స్నేహితులకు పంచాడు కేటుగాడు. గుంటూరు స్వర్ణభారతీనగర్‌‌కు చెందిన బాలిక నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఆ బాలిక ఇంటికి సమీపంలో ఉండే త్రినాథ్ అనే యువకుడు ఇంటర్ చదువుకుని కూలి పనులు చేస్తున్నాడు.

ప్రేమిస్తున్నానంటూ ఆ బాలిక వెంటపడి.. చాక్లెట్లు, ఖరీదైన బహుమతులు ఇచ్చి బుట్టలో వేసుకున్నాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఓ నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం తమ ఇద్దరి విషయాన్ని స్నేహితుడు మోహన్ కృష్ణకు తెలిపాడు. ఒకరోజు వీరిద్దరూ కలిసి బాలికను స్వర్ణభారతీనగర్‌లోని ఓ ప్రదేశానికి తీసుకెళ్లి ఒకరి తర్వాత మరోకరు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనను వీడియో తీసి.. విషయాన్ని  బయటకు చెబితే.. ఆ వీడియోలు ఇంటర్నెట్‌లో పెడతామంటూ బెదిరించారు. దీంతో ఆ బాలిక మౌనంగా ఉండిపోయింది....అలా కొద్దినెలలుగా వారిద్దరూ బెదిరించి లొంగదీసుకుంటున్నారు. ఆ తర్వాత వీరి విషయం తెలుసుకున్న  మరో ఇద్దరు స్నేహితులు బాలిక వెంటపడి.. బెదిరించి అత్యాచారం చేశారు. అలా ఏడాదికాలంగా స్నేహితులందరూ ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు.

చివరకు వీరి వేధింపులు భరించలేక బాలిక విషయాన్ని ఇంట్లో చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన అర్బన్ ఎస్పీ నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరేనా లేక మరికొంతమంది సదరు బాలికను లైంగిక వేధింపులకు గురిచేశారా..? అన్న కోణంలో దర్యాప్తును చేస్తున్నారు.
 

loader