కడప: బీజేపీ, వైసీపీ, జనసేనలపై ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. మూడు పార్టీలు ఒకే గూటి కిందకు చెందినవేనని ఆరోపించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ధర్మపోరాట దీక్షకు హాజరైన మంత్రి లోకేష్ కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు కానీ అది ఈనాటికి నెరవేర్చలేదని విమర్శించారు. అమరావతి వచ్చి రాజధాని నిర్మాణానికి పూర్తి స్థాయి నిధులు ఇస్తామని హామీ ఇచ్చిన మోదీ కేవలం వెయ్యి కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. 
 
ప్రత్యేక హోదాపై తాము చర్చకు సిద్ధమని బీజేపీ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రాఫెల్ కుంభకోణం,  నోట్ల రద్దుపై బహిరంగ చర్చకు సిద్దమా అంటూ బీజేపీకి సవాల్ విసిరారు లోకేష్. మోదీకి రాష్ట్రంలో ఇద్దరు సుపుత్రులు ఉన్నారని వారిలో దొంగపుత్రుడుు జగన్, మరో దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు. 

మోదీని ఒక్కమాట అయినా అన్నా ఇద్దరు నేతలు ఉలిక్కిపడతారని వీళ్లు మోదీని కానీ బీజేపీని కానీ ఒక్కమాట మాట్లాడరని మండిపడ్డారు. బీజేపీ, వైసీపీ, జనసేనలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. 

బీజేపీ అంటే భారతీయ జనతాపార్టీ కాదని బీ అంటే బీజేపీ అని జే అంటే జగన్ అని, పీ అంటే పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రామా కంపెనీ అంటూ ఘాటుగా విమర్శించారు. వైసీపీ కేంద్రంతో లాలూచీ పడి ఏపీకి పంగనామాలు పెట్టాలని ప్రయత్నించిందని ఆ డ్రామాలు బెడిసి కొట్టడంతో కోడికత్తి డ్రామా మెుదలుపెట్టిందని ధ్వజమెత్తారు లోకేష్. 

కోడికత్తి డ్రామా స్క్రిప్ట్ ఢిల్లీలో రెడీ అయితే యాక్షన్ విశాఖలో స్టార్ట్ అయ్యిందని  గుచ్చింది వైసీపీ కార్యకర్త అంటూ విమర్శించారు. జగన్ పై దాడి జరిగిన తర్వాత విశాఖ,హైదరాబాద్ విమానాశ్రయాలలో మూడు గంటలపాటు చేతులూపిన జగన్, ఆ తర్వాత ఆస్పత్రిలో పడిపోయారని చికిత్స చేయించుకున్న ఫోటోలు విడుదల చేసి అల్లర్లకు ప్రయత్నించారని ధ్వజమెత్తారు.  

అసెంబ్లీకి రారు, ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలను నమ్మరు, పోలీసులను నమ్మరు కానీ ఆంధ్రప్రదేశ్ కు మాత్రం ముఖ్యమంత్రి అయిపోవాలని ఆశపడుతుంటారని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి పేరు కూడా మార్చేశామని జగన్ పేరు ఇకపై జగన్ మోడీ రెడ్డి అంటూ దుయ్యబుట్టారు లోకేష్. 

పాదయాత్రకు సమయం ఉంటుంది, దసరాకు సమమం ఉంటుంది, సీబీఐ విచారణకు సమయం ఉంటుంది కానీ ఒక ఎమ్మెల్యే మావోయిస్టుల చేతిలో హతమైతే వారిని పరామర్శించేందుకు తీరిక లేదా అని నిలదీశారు. తిత్లీ తుఫాన్ ధాటికి శ్రీకాకుళం జిల్లా సర్వం కోల్పోతే వారిని పరామర్శించేందుకు సమయం ఉండదా అంటూ ప్రశ్నించారు. 

ఇకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్నో, ఢిల్లీ, ఫామ్ హౌస్ లకు వెళ్లేందుకు సమయం ఉంటుంది కానీ మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన సర్వేశ్వరరావు కుటుంబాన్ని  పరామర్శించేందుకు సమయం లేదా అని నిలదీశారు. అవిశ్వాసం పెడితే ఢిల్లీని వణికిస్తానని చెప్పిన పవన్ ఆ తర్వాత నోరు మెుదపలేదన్నారు. తిత్లీ తుఫాన్ వచ్చిన 12 గంటల్లో సీఎం చంద్రబాబు అక్కడ చేరుకుంటే వారం రోజుల తర్వాత పవన్ వస్తారని మండిపడ్డారు.  

ఈ వార్తలు కూడా చదవండి

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

ఆపరేషన్ గరుడ: హీరో శివాజీ అమెరికా చెక్కేశాడా...

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మరో వీడియో విడుదల చేసిన శివాజీ

మానని జగన్ గాయం: కత్తికి విషం లేదు

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: శ్రీనివాస్‌తో వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ సంభాషణ

జగన్‌పై దాడి.. బొత్స మేనల్లుడి హస్తం: నక్కా ఆనంద్‌బాబు

దండం పెడతారు లేదా దండలేస్తారు కానీ హత్యాయత్నం చెయ్యరు:టీడీపీకి బొత్స కౌంటర్

చంద్రబాబు చిన్నమెదడు చితికింది ఆయన ఓ ఉన్మాది: బొత్స ఫైర్

నిజాలు నిగ్గు తేలాలంటే కేంద్ర దర్యాప్తు అవసరం: బొత్స

టీడీపీదే కుట్ర... శ్రీనివాసరావు కోటి రూపాయల ల్యాండ్ డీల్ : రోజా

జగన్‌పై దాడి: కడప వెళ్తున్న చంద్రబాబు.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక