జమ్ములమడుగులో జరిగిన అభివృద్ధిలో 1 శాతం పులివెందులలో జరగలేదన్నారు. 1999, 2004లో వివేకా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తానన్నప్పుడు వైఎస్ కుటుంబంతో వివాదం జరిగిందని మంత్రి తెలిపారు.

2009లో రాజశేఖర్ రెడ్డి... వివేకానందరెడ్డిని ఎమ్మెల్సీని చేసి జగన్‌కు కడప ఎంపీ టికెట్ ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. పార్టీ కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం జమ్మలమడుగును వదులుకుని తాను లోక్‌సభ బరిలో నిలిచినట్లు ఆదినారాయణ రెడ్డి తెలిపారు.

అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టే జగన్‌కు జీతాలు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటారని ఆయన ఎద్దేవా చేశారు. దేశానికి ఉన్న నాలుగు పిల్లర్ల గురించి జగన్‌కు తెలుసా అని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు.

జగన్ ధనదాహం, పదవీ దాహం ఎప్పటికీ ఆగదని మంత్రి మండిపడ్డారు. 14 గంటలు కరెంట్ ఇచ్చిన రాజశేఖర్ రెడ్డి దేవుడైతే 24 గంటల పాటు కరెంట్ ఇచ్చిన చంద్రబాబు ఏమవుతారని ఆయన ప్రశ్నించారు.

రెడ్లకు చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం కల్పించారని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. దేవుడు ప్రత్యక్షమైతే జగన్ డబ్బే అడుగుతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

వైఎస్ వివేకానందరెడ్డి మృతి: సిట్ ఏర్పాటు చేసిన సర్కార్

ఎన్నికలను ఎదుర్కోలేకే వివేక మరణంపై రాజకీయం: ఆదినారాయణరెడ్డి

తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?

నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

వివేకా బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ

వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి

వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం

నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం