హైదరాబాద్: తాను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మేడా మల్లికార్జునరెడ్డి తన రాజీనామా విషయాన్ని బహిర్గతం చేశారు. 

వైఎస్ జగన్ సైతం తమ భేటీలో ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతే  పార్టీలో చేరాలని చెప్పారని తెలిపారు. అయితే స్పీకర్ ఫార్మెట్ లో బుధవారం రాజీనామా చేయనున్నట్లు స్పష్టం చేశారు. 

అనంతరం ఈనెల 31న తనతోపాటు తన కార్యకర్తలు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. ఇకపై వైఎస్ జగన్ ఏది చెబితే అది చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడును ఓడించి జగన్ ను సీఎం చేసేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. 

రాష్ట్రంలో చాలా మంది బాబు నిన్ను నమ్మం బాబూ అంటూ పార్టీ వీడతారంటూ చెప్పుకొచ్చారు. ఇకపై తాను తన కుటుంబం జగన్ ను నమ్ముకున్నామని జగన్ ఏది చెబితే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నాని మేడా మల్లికార్జునరెడ్డి తెలిపారు.  

చంద్రబాబు నాయుడు దోపిడీని అవినీతిని భరించలేక తాను  పార్టీ వీడుతున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్ నైతిక విలువలు తెలిసిన వ్యక్తి అంటూ కొనియాడారు. అందువల్లే తాను పార్టీలోకి చేరే ముందు పదవికి రాజీనామా చెయ్యాలని కండీషన్ పెట్టిన విషయాన్ని స్పష్టం చేశారు. 

ప్రజాసేవ చెయ్యాలన్న ఆకాంక్ష జగన్ కుటుంబానికే ఉందన్నారు. ప్రజల కోసం పోరాటాలు చేసిన కుటుంబం రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటూ కొనియాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తే, ఆయన తనయ వైఎస్ షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేశారని గుర్తు చేశారు.

ఇటీవల వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలను తెలుసుకున్నారని చెప్పుకొచ్చారు. జగన్ లాంటి నాయకుడు రాష్ట్రానికి ఎంతో అవసరమని చంద్రబాబు నాయుడు చెప్పే మాయమాటలను తిప్పికొట్టి జగన్ ను సీఎం చెయ్యడమే లక్ష్యంగా తాము పనిచేస్తామని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి హామీ ఇచ్చారు. 

ఈ వార్తలు కూడా చదవండి

మేడాకి అసలు ఆ అర్హత లేదు... చంద్రబాబు

టీడీపి నుంచి మేడా సస్పెన్షన్: చంద్రబాబు ప్రకటన

చంద్రబాబుతో భేటీకి డుమ్మా: జగన్ తో భేటీకి మేడా రెడీ

మేడా మాట మార్చారు, సోదరుడి కోసమే..: సిఎం రమేష్

అమరావతిలో రాజంపేట పంచాయతీ: బాబుతో మేడా వ్యతిరేక వర్గం భేటీ

మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఔట్: తెరమీదికి చరణ్ రాజు

అవమానిస్తున్నారు: ఆదిపై మేడా మల్లిఖార్జున్ రెడ్డి సంచలనం

టీడీపీలో రాజంపేట లొల్లి: మేడాకు అందని ఆహ్వానం

బాబుకు షాక్: ఎమ్మెల్యే మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీ వైపు చూపు