హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి రాజంపేట శానససభ్యుడు మేడా మల్లికార్డున్ రెడ్డి సస్పెన్షన్ కు గురయ్యారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు  నాయుడు నిర్ణయం తీసుకున్నారు. 

మంగళవారం అమరావతిలో జరిగిన రాజంపేట టీడీపి కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు తన నిర్ణయాన్ని ప్రకటించారు. మేడా మల్లికార్డున్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాజంపేట కార్యకర్తలు ఏకగ్రీవంగా చంద్రబాబును కోరారు. వారి కోరికను చంద్రబాబు మన్నించారు. 

మేడా మల్లికార్డున్ రెడ్డి చంద్రబాబు ఏర్పాటు చేసిన రాజంపేట నియోజకవర్గం పార్టీ నేతల సమావేశానికి గైర్హాజరయ్యారు. పైగా, ఆయన మంగళవారం సాయంత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వైఎస్సార్ కాంగ్రెసులో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

రాజంపేట తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మేడా మల్లికార్జున్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ చేరడం ఖరారైంది. ఆయన మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలనున్నారు. లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో ఈ భేటీ జరుగుతుంది. ఈ భేటీలోనే ఆయన వైసిపిలో చేరుతారని అంటున్నారు.

సంబంధిత వార్తలు

చంద్రబాబుతో భేటీకి డుమ్మా: జగన్ తో భేటీకి మేడా రెడీ

మేడా మాట మార్చారు, సోదరుడి కోసమే..: సిఎం రమేష్

అమరావతిలో రాజంపేట పంచాయతీ: బాబుతో మేడా వ్యతిరేక వర్గం భేటీ

మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఔట్: తెరమీదికి చరణ్ రాజు

అవమానిస్తున్నారు: ఆదిపై మేడా మల్లిఖార్జున్ రెడ్డి సంచలనం

టీడీపీలో రాజంపేట లొల్లి: మేడాకు అందని ఆహ్వానం

బాబుకు షాక్: ఎమ్మెల్యే మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీ వైపు చూపు