హైదరాబాద్: రాజంపేట శాసనసభ్యుడు మేడా మల్లికార్జున్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశానికి రాకపోవడంపై తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ స్పందించారు. మేడాను తానే ఆహ్వానించానని, వస్తానని తొలుత చెప్పి ఆ తర్వాత మాట మార్చారని ఆయన మంగళవారం మీడియాతో అన్నారు. 

రాజంపేట సీటు పంచాయతీని చంద్రబాబు వద్ద తేల్చుకోవడానికి కడప జిల్లా నేతలు అమరావతి చేరుకున్నారు. ఈ సమయంలో మేడా మల్లికార్జున్ రెడ్డి వ్యవహారంపై రమేష్ మాట్లాడారు. మేడా సౌమ్యుడేనని, అయితే సోదరుడి కోసమే మాట మార్చారని ఆయన అన్నారు. మేడా పార్టీ వీడినా కడప జిల్లాలో తెలుగుదేశం బలంగానే ఉంటుందని ఆయన అన్నారు. ఈసారి కడప జిల్లాలో మెజారిటీ స్థానాలు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

వాస్తవానికి గత ఎన్నికల్లో రాజంపేట సీటును బిజెపి అడిగిందని, అయితే మేడా కోసం తాము ఆ సీటును బిజెపికి కేటాయించడానికి నిరాకరించామని ఆయన చెప్పారు. తన సోదరుడు రఘునాథ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తారని మేడా మల్లికార్జున్ రెడ్డి స్వయంగా చెబుతున్నారని ఆయన అన్నారు. 

చంద్రబాబుతో సమావేశం గురించి మేడా మల్లికార్జున్ రెడ్డికి సమాచారం ఇచ్చామని, మేడా మల్లికార్డున్ రెడ్డిని సమావేశానికి ఆహ్వానించామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా చెప్పారు. అయితే, సమావేశం గురించి తనకు సమాచారం లేదని మేడా అంటున్ారు.

మేడా మల్లికార్జున్ రెడ్డి వ్యతిరేక వర్గీయులు ఇప్పటికే అమరావతి చేరుకున్నారు. మేడా మల్లికార్డున్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అమరావతిలో రాజంపేట పంచాయతీ: బాబుతో మేడా వ్యతిరేక వర్గం భేటీ

మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఔట్: తెరమీదికి చరణ్ రాజు

అవమానిస్తున్నారు: ఆదిపై మేడా మల్లిఖార్జున్ రెడ్డి సంచలనం

టీడీపీలో రాజంపేట లొల్లి: మేడాకు అందని ఆహ్వానం

బాబుకు షాక్: ఎమ్మెల్యే మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీ వైపు చూపు