కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్మే మేడా మల్లిఖార్జున రెడ్డి పార్టీ మారతారంటూ ప్రచారం జరగడం... సొంతపార్టీలోని వాళ్లే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మేడా ప్రెస్‌మీట్‌లో చెప్పడంతో టీడీపీలో దుమారం రేగింది.

ఈ నేపథ్యంలో రాజంపేట నియోజకవర్గ నేతలతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకల్లా అమరావతికి రావాలని పార్టీ నేతలను ఆయన ఆదేశించారు. ఈ క్రమంలో మేడా మల్లికార్జున రెడ్డి వ్యతిరేక వర్గం ఇప్పటికే అమరావతి చేరుకుంది. మేడా పార్టీ మారడం ఖాయమంటూ వారు బలంగా వాదిస్తున్నారు.

మరోవైపు అధినేతతో సమావేశానికి మేడా వర్గం హాజరవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతిలో చంద్రబాబుతో సమావేశానికి తమకు అధిష్టానం నుంచి ఎలాంటి ఆహ్వానం రానందున ఆయన వర్గం ఈ భేటీకి హాజరుకావడం లేదంటూ ప్రచారం జరుగుతోంది.

దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని కాబట్టి తమలో ఒకరికి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించాలని మేడా వ్యతిరేక వర్గం అధినేత దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. రెండు రోజుల కిందట రాజంపేటలో జరిగిన కీలక టీడీపీ సమావేశానికి ఎమ్మెల్యే మేడాకు ఆహ్వానం అందలేదు.

దీంతో ఆయన తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి రాయచోటిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన పార్టీ మారబోతున్నట్లు మీడియాలో కథనాలు రావడంతో ఆదివారం సాయంత్రం మేడా ప్రెస్‌మీట్ నిర్వహించి పార్టీలోని పరిణామాలను ఏకరువు పెట్టారు. 

మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఔట్: తెరమీదికి చరణ్ రాజు

అవమానిస్తున్నారు: ఆదిపై మేడా మల్లిఖార్జున్ రెడ్డి సంచలనం

టీడీపీలో రాజంపేట లొల్లి: మేడాకు అందని ఆహ్వానం

బాబుకు షాక్: ఎమ్మెల్యే మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీ వైపు చూపు