కడప: కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి టీడీపీని వీడే యోచన చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.ఈ నెలాఖరులో మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీలో చేరే అవకాశం ఉందని సమాచారం.

గత ఏడాదిలోనే  మల్లిఖార్జున్  రెడ్డి టీడీపీని వీడుతారనే ప్రచారం సాగింది.ఆ సమయంలో మల్లిఖార్జున్ రెడ్డి  ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిశారు. తాను పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. 

అయితే పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని మల్లిఖార్జున్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కూడ మల్లిఖార్జున్ రెడ్డి సంప్రదింపులు జరిపినట్టు ప్రచారంలో కూడ సాగింది. ఈ విషయమై మల్లిఖార్జున్ రె్డ్డి జిల్లాకు చెందిన వైసీపీ నేతలతో కూడ చర్చించినట్టు తెలుస్తోంది.

మేడా మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై కుటుంబసభ్యులతో మల్లిఖార్జున్ రెడ్డి చర్చించినట్టు సమాచారం. కుటుంబసభ్యులు కూడ మల్లిఖార్జున్ రెడ్డిని పార్టీ మారాలని ఒత్తిడి తీసుకొచ్చినట్టు ప్రచారం సాగుతోంది. 

జగన్ విదేశీ పర్యటనకు ముందే మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.ఇదిలా ఉంటే రాజంపేట మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత అమర్‌నాథ్ రెడ్డితో కూడ మల్లిఖార్జున్ రెడ్డి చర్చించినట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై మల్లిఖార్జున్ రెడ్డి ప్రకటించలేదు.