పార్టీలో కొనసాగుతూనే.. వైసీపీ నేతలపై చర్చలు జరిపారంటూ.. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిపై చంద్రబాబు సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. కాగా.. టీడీపీలో ఉండే అర్హత అసలు మేడాకి లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.మేడా మల్లికార్జున రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవారికి పార్టీలో స్థానం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 

మేడా మల్లికార్జునరెడ్డిని ఎమ్మెల్యేను చేశామని..శాసనసభ విప్ గా నియమించామని గుర్తు చేశారు. మేడా తండ్రి ఐదేళ్లు పదువులు అనుభవించి.. ఎన్నికలు దగ్గరపడగానే వేరే పార్టీలోకి వెళ్లిపోయారని చెప్పారు. గెలుపోటములకు తాను ఎప్పుడూ భయపడనని ఆయన  అన్నారు. కుట్రలు, కుతంత్రాలకు కూడా తాను ఎప్పుడూ భయపడనని చెప్పారు.

రాజంపేట కార్యకర్తలకు సోమిరెడ్డి, ఆదినారాయణ రెడడ్ి, శ్రీనివాసులు రెడ్డి అండగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ టీడీపీనే అధికారంలోకి వస్తుందన్నారు. మధ్యలో వచ్చినవాళ్లు.. మధ్యలోపోతారన్నారు. టీడీపీకి కార్యకర్తలే బలం అన్నారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు.