రాజంపేట: కడప జిల్లా రాజంపేట టీడీపీ ముఖ్య నేతల సమావేశాన్ని ఆదివారం నాడు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డికి సమాచారం ఇవ్వలేదు మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే కారణంగానే  ఈ సమాచారాన్ని ఇవ్వలేదని జిల్లా టీడీపీ నేతలు చెబుతున్నారు.

కడప జిల్లా  రాజంపేట  ఎమ్మెల్యే మల్లిఖార్జున్ రెడ్డి  వైసీపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని మల్లిఖార్జున్ రెడ్డి ఖండించారు. కడప జిల్లా రాజంపేటలో ఇవాళ టీడీపీ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డితో పాటు ఆయన వర్గీయులకు సమాచారాన్ని ఇవ్వలేదు.  మేడా మల్లిఖార్జున్ రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరుతారనే ప్రచారం ఉన్నందునే ఈ సమాచారం ఇవ్వలేదని టీడీపీ నేతలు  చెబుతున్నారు.

తమకు తెలియకుండా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడంపై మేడా మల్లిఖార్జున్ రెడ్డి వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. టీడీపీ  ఏర్పాటు చేసే సమావేశాన్ని అడ్డుకోవాలని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

బాబుకు షాక్: ఎమ్మెల్యే మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీ వైపు చూపు