అమరావతి: జ్యోతి హత్యలో ప్రియుడు శ్రీనివాస్‌కు  సహకరించిన పవన్‌ను పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు. వారం రోజుల ముందే  ఈ హత్యకు  శ్రీనివాస్ ప్లాన్ చేసినట్టుగా గుర్తించారు. జ్యోతిని హత్య చేసిన స్థలంలో వారం రోజుల ముందే రెక్కీ చేశారని విచారణలో శ్రీనివాస్ ఒప్పుకొన్నట్టు తెలుస్తోంది.

ఈ నెల 11వ తేదీ రాత్రి అమరావతి టౌన్‌షిప్‌ సమీపంలో  జ్యోతిని  ఆమె ప్రియుడుశ్రీనివాస్ దారుణంగా  హత్య చేశాడు. పెళ్లి చేసుకోవాలని  జ్యోతి ఆమె ప్రియుడుశ్రీనివాస్‌పై ఒత్తిడి తీసుకువస్తోన్నందున ఆమెను చంపాలని  శ్రీనివాస్ నిర్ణయం తీసుకొన్నాడు. ఈ విషయంలో ఇద్దరు మిత్రుల సహకారం తీసుకొన్నాడని పోలీసులు గుర్తించారు.

శ్రీనివాస్‌కు సహకరించిన ఇద్దరు మిత్రులను  సోమవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే జ్యోతి హత్యలో శ్రీనివాస్‌కు పవన్ అనే  స్నేహితుడు సహకరించినట్టుగా విచారణలో శ్రీనివాస్  ఒప్పుకొన్నాడు.

పెళ్లి చేసుకోవాలని శ్రీనివాస్‌పై జ్యోతి ఒత్తిడి తీసుకురావడంతో  ఆమెను చంపాలని నిర్ణయం తీసుకొన్నాడు. పథకం ప్రకారంగా శ్రీనివాస్ జ్యోతి కాళ్లు, చేతులు పట్టుకొంటే పవన్ ఇనుపరాడ్‌తో  ఆమె తలపై కొట్టాడు.దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

మరోవైపు ఈ ఘటనలో ఎవరికీ కూడ అనుమానం రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో శ్రీనివాస్ తలపై కూడ పవన్ కొట్టాడు. ఈ రాడ్‌ను  సమీపంలోని కాలువలో పారేసినట్టు పవన్ పోలీసుల విచారణలో ఒప్పుకొన్నాడు

సంబంధిత వార్తలు

జ్యోతి హత్య ప్రియుడి పనే: యువతుల న్యూడ్ వీడియోలు తీసిన చరిత్ర

జ్యోతి హత్య: పోలీసుల తీరుపై కుటుంబ సభ్యుల ధర్నా

అమరావతి హత్య, రేప్‌‌కేసు : జ్యోతి మృతదేహం వెలికితీత, రీ పోస్ట్‌మార్టం

జ్యోతి హత్య కేసు: పోలీసుల తీరుపై అనుమానాలు

శ్రీనివాస్ బైక్‌పై జ్యోతి: సీసీటీవీ కెమెరాకు చిక్కిన దృశ్యం

అమరావతి రేప్, హత్య కేసులో సంచలనం: ప్రియుడిపైనే అనుమానాలు

ప్రియుడి ముందే ప్రేయసిపై రేప్: దాడి, యువతి మృతి