గుంటూరు: భార్య నగ్న వీడియోలను అమ్మకానికి పెట్టిన ఆమె భర్త వంశీకాంత్ ను పోలీసుుల అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ మీడియాకు వివరించారు. భార్య నగ్న వీడియోల ద్వారా వంశీకాంత్ వివిధ యాప్ ల ద్వారా అమ్మకానికి పెట్టినట్లు ఆయన తెలిపారు. 

ఆ వీడియోలను కొనుగోలు చేసిన శివకుమార్ అనే వ్యక్తిని కూడా పోలీసుుల అరెస్టు చేశారు. మరింత మందిని ఈ కేసులో అరెస్టు చేయాల్సి ఉందని చెప్పారు. మహిళ నగ్న వీడియోలను అందుకున్న శివకుమార్ ఆమె భర్తకు ఫోన్ పే ద్వారా డబ్బుుల పంపినట్లు ఆయన తెలిపారు.

Also Read: సులువుగా డబ్బు సంపాదించాలని: భార్య నగ్న వీడియోలను..!!

తన స్నేహితులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని కూడా వంశీకాంత్ భార్యను వేధించినట్లు ఎస్పీ చెప్పారు. భార్య నగ్న వీడియోలు ఆమెకు తెలియకుండా తీసి వంశీకాంత్ సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేసిన విషయం తెలిసిందే. ఆమె భర్తను పోలీసులు విచారించారు. ఆ విచారణలో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంతో పాటు లైవ్ స్ట్రీమింగ్ యాప్ ద్వారా తన భార్య అశ్లీలంగా ఉన్న దృశ్యాలను డబ్బుల కోసం చూపించేవాడని విచారణలో తేలింది. 

తన భార్య నగ్న వీడియోలను చూడడానికి వంశీకాంత్ ఓ సమయం కేటాయించి, ఆ సమయంలో వాటిని చూడడానికి ఇష్టపడే వారిని ుంచి డబ్బులు తీసుకునేవాడని తేలింది. డబ్బు కోసం భర్త చేస్తున్న నీచం పని తనకు తెలియడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్పీ సోమవారం వెల్లడించారు.