వివాహాలు విచ్ఛిన్నం: ప్రేమికుల కథ విషాదాంతం

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 18, Aug 2018, 4:57 PM IST
lovers committed sucide at ungutur in westgodavari district
Highlights

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో నంద్యాల సురేష్, తణుకు ఉమా సరోజినిలు ఒకే చున్నీకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. పెళ్లైనా వీరిద్దరూ  తమ  భాగస్వామ్యులతో దూరంగా ఉంటున్నారు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో నంద్యాల సురేష్, తణుకు ఉమా సరోజినిలు ఒకే చున్నీకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. పెళ్లైనా వీరిద్దరూ  తమ  భాగస్వామ్యులతో దూరంగా ఉంటున్నారు. అయితే  వీరిద్దరి మధ్య ఏర్పడిన ప్రేమకు పెద్దలు  అడ్డు చెప్పారు. మూడు రోజుల క్రితం ఈ జంట  ఇంటి నుండి పారిపోయింది.  కానీ, చివరకు  ఆత్మహత్యకు పాల్పడడంతో  కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులోని కోనేరుపేటకు చెందిన నంద్యాల సురేష్ కు కైకరానికి చెందిన నాగలక్ష్మికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు. కుమార్తె ఉన్నారు. అయితే అదే వీదికి చెందిన జొన్నాడ ఉమాసరోజినికి తణుకు మండలం కాయలపాడుకు చెందిన తణుకు సుబ్బారావుతో వివాహమైంది.  వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు.  సురేష్ భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు.  సరోజిని కూడ తన భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటుంది.

వీరిద్దరూ  అదే ప్రాంతంలో నివాసం ఉండడంతో ఏర్పడిన పరిచయం  వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసిన రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు ఇద్దరిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో సురేష్, సరోజిని మూడు రోజుల పాటు క్రితం గ్రామం నుండి పారిపోయారు.  

అయితే శుక్రవారం సాయంత్రం వీరిద్దరూ కూడ  ఉంగుటూరు  కోనేరుపేటకు వచ్చారు. ఒ పూరిగుడిసెలో  ఓకే చున్నీకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు.స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనాస్థలాన్ని  పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

 

ఈ వార్తలు చదవండి

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

అఫైర్: పెళ్లయ్యాక ప్రియుడితో జంప్, వద్దన్న భర్తకు షాక్

వివాహేతర సంబంధం: ప్రశ్నించిన భర్తకు షాకిచ్చిన భార్య

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

76 ఏళ్ల వయస్సులో చిన్నారులపై లైంగిక వేధింపులు: రాత్రి గదిలో ఇలా..

 

 

 

loader