విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లాలో భర్తను హత్య చేసిన భార్య కేసు  కొత్త మలుపు తిరిగింది.  వివాహేతర సంబంధం వద్దని  హెచ్చరించినందుకు భర్తను హత్య చేసింది. ఈ ఘటనలో  పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. అయితే పోస్ట్‌మార్టం నివేదికలో  మాత్రం ఇద్దరు లేదా  ముగ్గురు  కోటేశ్వర్‌రావును హత్య చేసి ఉంటారని తేలింది.  ఈ ఘటనలో నిందితురాలికి సహకరించిన వారెవరనే కోణంలో  దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖపట్టణంలో జిల్లాలోని కశింకోటలో ఆగష్టు 11వ తేదీన  ఎన్. కోటేశ్వర్ రావు అనే తాపీ మేస్త్రీని భార్య హత్య చేసింది.  భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసిన భర్త కోటేశ్వర్ రావు  ఆమెను మందలించాడు. అయితే ఈ విషయమై భర్త అడ్డు తొలగించుకోవాలని ఆమె భావించింది.దరిమిలా ఆగష్టు 11 వ తేదీన భర్తను  సుత్తితో కోట్టి హత్య చేసింది. 

అయితే శరీరానికి పసుపు రాసి  గుండెపోటుత మరణించాడని  నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే  ఈ విషయమై కోటేశ్వర్ రావు సోదరి మృతదేహంపై ఉన్నగాయాలను చూసీ పోలీసులకు ఫిర్యాదు చేస్తే  నిందితురాలు అసలు విషయాన్ని ఒప్పుకొంది.

 అయితే కోటేశ్వర్ రావు మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిర్వహిస్తే  ఇద్దరు ముగ్గురు కలిసి హత్య చేసినట్టు వైద్యులు అభిప్రాయపడ్డారు.  తాడుతో గొంతు భాగంలో నులిమి హత్య చేసినట్టు  పోస్ట్‌మార్టం రిపోర్టులో తేలింది.  అయితే కోటేశ్వర్ రావు భార్యకు సహకరించిన వారెవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అనకాపల్లిలోని నీలకంఠరావు వీధికి చెందిన నూకేశ్వరరావుకు కశింకోటలోని కోటవీధికి చెందిన యువతితో మూడేళ్ల క్రితం వివాహమైంది. చిన్న వయసులోనే ఆమెను నూకేశ్వరరావుకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లయిన కొంత కాలానికి వీరిమధ్య మనస్పర్ధలు వచ్చాయి.  నూకేశ్వరరావుకు అనకాపల్లిలో సొంత ఇల్లు ఉంది. తన తల్లిదండ్రులతో పాటుగా భార్యాభర్తలిద్దరూ ఇక్కడే ఉండేవారు. వీరి మధ్య గొడవలు జరుగుతుండటంతో భార్యభర్తలిద్దరూ కశింకోటలో వేరే కాపురం పెట్టారు.

నూకేశ్వర్‌రావు భార్య 2018 మార్చిలో అదృశ్యమైంది. దీనిపై భర్త నూకేశ్వరరావు కశింకోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. 20 రోజుల అనంతరం తిరిగి ఇంటికి వచ్చిన ఆమెను పోలీస్‌స్టేషన్‌లో విచారించారు. తనకు నూకేశ్వరరావుతో కలసి ఉండటం ఇష్టం లేదని, మరో వ్యక్తితో వివాహం చేయాలని పోలీసులకు ఆమె చెప్పింది. అయితే ఆ సమయంలో  ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. 

అయితే అప్పటి నుండి నూకేశ్వర్‌రావు భార్య పుట్టింట్లోనే ఉండేది.  అయితే నూకేశ్వర్ రావు తల్లి ఇటీవలనే మరణించింది. దీంతో భర్తను పరామర్శించిన నూకేశ్వర్ రావు  భార్య ఇద్దరం కలిసి ఉందామని కోరింది.  దీంతో వీరిద్దరూ కశింకోట పెదబజారులో ఇల్లు అద్దెకు తీసుకోని ఉంటున్నారు. ఈ నెల 11 వ తేదీన నూకేశ్వర్ రావు హత్యకు గురయ్యాడు.

ఈ వార్తలు చదవండి

వివాహేతర సంబంధం: ప్రశ్నించిన భర్తకు షాకిచ్చిన భార్య

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు