76 ఏళ్ల వయస్సులో కూడ  జోసఫ్ అనే ఫాస్టర్  అభం భుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఏళ్లతరబడి నిందితుడు బాలికలపై  అత్యాచారాలకు పాల్పడుతున్నాడు

ఒంగోలు: 76 ఏళ్ల వయస్సులో కూడ జోసఫ్ అనే ఫాస్టర్ అభం భుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఏళ్లతరబడి నిందితుడు బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్నాడు. ఎట్టకేలకు ఈ విషయం బయటకు రావడంతో ఈ ఆశ్రమంలో ఉన్న 46 మంది బాలికలకు బాలసదన్‌లో రక్షణ కల్పించారు.

అనాథాశ్రమాల్లో జరుగుతున్న అక్రమాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అన్ని రాష్ట్రాల్లో ఆశ్రమాలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాల మేరకు ఒంగోలులోని ఇండియా ఎవాంజిలకల్‌ రిలీఫ్‌ ఫెలోషిప్‌ (ఐఈఆర్‌ఎఫ్) అనాథ ఆశ్రమంలో గురువారం నాడు తనిఖీలు నిర్వహించారు.

ఈ అనాథాశ్రమంలో బాలికలపై లైంగిక వేధింపులు చోటు చేసుకొంటున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. ఈ విషయమై కన్నీరు పెట్టుకొన్నారు. తమను రక్షించాలని కోరారు. 

ఇండియా ఎవాంజిలకల్‌ రిలీఫ్‌ ఫెలోషిప్‌ (ఐఈఆర్‌ఎఫ్‌) పేరుతో ఒంగోలులోని క్లౌపేటలోని ఆరవ లైనులో మూడున్నర దశాబ్దాలుగా కొడవటికంటి జోసఫ్‌ నడుపుతున్నారు. 1983లో రిజిష్టర్‌ నెం.76తో ఏర్పాటైన ఈ సంస్థకు అధ్యక్షుడి గా జోసఫ్‌ ఉండగా, సభ్యులుగా కుటుంబ సభ్యులు ఉన్నారు.ఎయిడెడ్‌ పాఠశాల నిర్వహణ, బాల, బాలికల అనాథాశ్రమం, పాస్ట ర్ల సమావేశాలు, పాస్టర్లకు సహకా రం, అనాథ బాల, బాలికలకు విద్య, వైద్యం అందిస్తున్నారు.

ప్రతిరోజూ తమపై జోసెఫ్ లైంగిక దాడికి పాల్పడతాడని బాలికలు అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రతి రోజూ ఎంపిక చేసిన నలుగురైదుగురు బాలికలను తన రూమ్‌లోనే ఉంచుకొంటాడని బాధితులు చెప్పారు.

తాను చెప్పినట్టుగా వినకపోతే తమపై దాడులకు దిగేవారని బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. తాకరాని చోట తమను తాకేవారని... తమతో రహస్య ప్రాంతంలో మర్ధన చేయించుకొనేవాడని బాధితులు చెప్పారు. ఒకవేళ అలా చేయకపోతే తమను కొట్టేవాడని బాధితులు అధికారుల దృష్టికి తెచ్చారు.

తనను తాతయ్య కాద... మామయ్య అని పిలవాలని కోరేవాడని బాధితులు చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు జోసెఫ్‌పై ఫోక్స్ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. 
బాలల సంక్షేమ కమిటీ కన్వీనర్‌ ఫరూక్‌బాషా ఫిర్యాదు మేరకు శుక్రవారం నాడు ఆయనను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

ఈ వార్తలు చదవండి

అఫైర్: పెళ్లయ్యాక ప్రియుడితో జంప్, వద్దన్న భర్తకు షాక్

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు

అల్లుడితో అత్త అఫైర్: అడ్డు చెప్పిన కొడుకును చంపించిన తల్లి