వివాహేతర సంబంధం: ప్రశ్నించిన భర్తకు షాకిచ్చిన భార్య

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 12, Aug 2018, 12:39 PM IST
wife kills husband for extra marital affair in Visakhapatnam district
Highlights

వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భర్తను  ఓ భార్య సుత్తితో మోది  హత్య చేసింది. అయితే తన భర్తది సహజ మరణమేనని నమ్మించే ప్రయత్నం చేసింది


విశాఖపట్టణం: వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భర్తను  ఓ భార్య సుత్తితో మోది  హత్య చేసింది. అయితే తన భర్తది సహజ మరణమేనని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే మృతుడి కుటుంబసభ్యులు  అనుమానంతో నిలదీశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో తానే హత్య చేసినట్టు నిందితురాలు ఒప్పుకొంది.ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకొంది.

విశాఖ జిల్లా కశింకోట పెదబజారు వీధిలో  నక్కా నూకేశ్వరరావు అలియాస్ నూకేష్, అతని భార్య నివాసం ఉంటున్నారు. నూకేష్‌కు 27 ఏళ్ల వయస్సు. ఆయన భార్యకు 17 ఏళ్లు. మైనార్టీ తీరకముందే నూకేష్ తో ఆమెకు వివాహం చేశారు.  అయితే పెళ్లి కాకముందే ఆ బాలికకు  మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది.

ఈ విషయం నూకేష్‌కు తెలియదు.ఈ వివాహం ఆ బాలికకు ఇష్టం లేదు. మూడేళ్ల క్రితం వీరికి వివాహమైంది. అయితే  మూడు మాసాల క్రితం వీరు  కశింకోట పెదబజారుకు కాపురాన్ని మార్చారు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉన్న విషయాన్ని నూకేష్ గుర్తించాడు. 

ఈ విషయమై భార్య, భర్తల మధ్య గొడవలు జరిగేవి. ఇదే విషయమై  శనివారం నాడు కూడ భార్య,భర్తల మధ్య గొడవ జరిగింది. అంతేకాదు వివాహేతర సంబంధాన్ని వదులుకోవాలని భర్త నూకేష్ భార్యను హెచ్చరించాడు.  దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన నూకేష్ భార్య ఇంట్లో ఉన్న సుత్తితో భర్త తలపై  కొట్టింది.

దీంతో తీవ్రంగా గాయపడిన నూకేష్ అక్కడికక్కడే మరణించాడు. అయితే తన భర్తది సహజమరణంగా ఆమె నమ్మించే ప్రయత్నం చేసింది. సంప్రదాయం ప్రకారంగా  భర్త శరీరంపై  పసుపు రాసింది. అయితే  నూకేష్ మృతదేహంపై ఉన్న గాయాలను చూసిన ఆమె సోదరి నిందితురాలిని ప్రశ్నించింది.

అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితురాలిని ప్రశ్నించారు.దీంతో ఆమె అసలు విషయాన్ని బయటపెట్టింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని... ఈ విషయమై ప్రశ్నించినందుకే తానే హత్యచేసినట్టు ఆమె ఒప్పుకొంది. 

ఈ వార్తలు చదవండి

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు

ట్విస్ట్: అందమైన భార్యను చూస్తున్నారని భర్త చేసిన పనికి షాకైన వైఫ్
 

loader