అమరావతి: ఆంధ్ర ఆక్టోపస్ గా పేరు పొందిన మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి మరింత ఉత్కంఠకు కారణమయ్యారు. ఇది తన అంచనా మాత్రమేనని చెప్పారు. 

లగడపాటి తెలంగాణ శాసనసభ ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వే తప్పుల తడకగా తేలిన విషయం తెలిసిందే. తన అంచనాలు తప్పు కావడానికి కారణాలు చెబుతానంటూ ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తున్నారు. అయితే, ఒక తెలంగాణ విషయంలోనే కాదు, గతంలో కూడా ఆయన సర్వేలు తారుమారైన సందర్భాలు ఉన్నాయి.

2016 మే లొ జరిగిన తమిళనాడు ఎన్నికల్లో లగడపాటి రాజగొపాల్ జయలలిత నేతృత్వంలోని అన్నాడియంకె ఓడిపోతుందని, కరుణానిధి నాయకత్వంలోని డిఎంకె బంపర్ మెజారిటితో విజయం సాధిస్తుందని చెప్పారు. ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. అన్నాడియంకెకు 134 సీట్లు  రాగా, డిఎంకెకు 89 స్థానాలు మాత్రమే వచ్చాయి. 

ఇక 2018 మే లొ జరిగిన కర్నాటక ఎన్నికల్లో మెజారిటి సర్వేలు హంగ్ ఏర్పడుతుందని చెప్పగా,లగడపాటి సర్వే మాత్రం బిజెపికి తిరుగులేని మెజారిటి వస్తుందని, ఎవరి మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని లగడపాటి చెప్పారు. 

అయితే, లగడపాటి కర్ణాటకపై ప్రకటించిన అంనచాలు కూడా తారుమారయ్యాయి. మెజారిటి సర్వేలు చెప్పినట్టుగా కర్ణాటకలో హంగ్ ఏర్పడింది. దాంతో కాంగ్రెస్ మద్దతు తొ  జెడిఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు.

తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని లగడపాటి శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా చెప్పారు. కానీ ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు జూపూడి ప్రభాకర్ రావు, అశోక్ బాబు, బుద్ధా వెంకన్నలతో కలిసి మీడియా సమావేశానికి వచ్చారు. 

సంబంధిత వార్తలు

హంగ్ ఏర్పడే పరిస్థితి లేదు, పూర్తి మెజారిటీతోనే ప్రభుత్వం : లగడపాటి

ఎన్నికల మధ్యలో జగన్ ను కలిశా: లగడపాటి రాజగోపాల్

పవర్ స్టార్ అసెంబ్లీలో అడుగు పెడ్తాడు, మెగాస్టార్ కన్నా తక్కువ సీట్లే: లగడపాటి

ఏపీలో సైకిల్, తెలంగాణలో కారు : తేల్చేసిన లగడపాటి రాజగోపాల్