తిరుపతి: రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వానికి తాను సహకరిస్తానని హామీ ఇచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. కాంచీపురంలోని అత్తివరదరాజస్వామిని దర్శించుకుని నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్లిన కేసీఆర్  అక్కడ భోజనం చేశారు. 

అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్, ఏపీలో జగన్ ప్రభుత్వానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. రాయలసీమకు గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా అందిస్తామని తెలిపారు. గోదావరి మిగులు జాలాలను వృథాగాపోకుండా ఏపీ ప్రజలకు అందిస్తామని తెలిపారు. 

వైయస్ జగన్ మంచి పట్టుదల ఉన్న నాయకుడు అని స్పష్టం చేశారు. జగన్ నాయకత్వంలో ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. జగన్ తో కలిసి ఇప్పటికే ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిపారు. 

గత 70 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో నూతన అధ్యయనానికి జగన్, తాను శ్రీకారం చుట్టినట్లు కేసీఆర్ తెలిపారు. కొంతమంది తమ కలయికను జీర్ణించుకోలేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త అధ్యయనం మాత్రం సృష్టిస్తామని తెలిపారు. జగన్ ప్రభుత్వానికి తాను అన్ని విధాలా అండదండలందిస్తానని కేసీఆర్ భరోసా ఇచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి

అప్పట్లో కేసీఆర్ పై రోజా బార్, దర్బార్ వ్యాఖ్యలు: ఇప్పుడు వేచి ఉండి స్వాగతం

రోజా ఇంటికి తెలంగాణ సీఎం కేసీఆర్: ఘన స్వాగతం పలికిన ఫైర్ బ్రాండ్

కేసీఆర్‌‌ కు రోజా ఘన స్వాగతం(వీడియో)

నగరిలో కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే రోజా

కొద్దిసేపట్లో ఎమ్మెల్యే రోజా ఇంటికి కేసీఆర్.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ