చిత్తూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులకు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్ కే రోజా విందు ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి కుటుంబసమేతంగా విచ్చేశారు కేసీఆర్. కేసీఆర్‌ దంపతులకు శాలువాతో సత్కరించి సాదరంగా ఆహ్వానించారు ఎమ్మెల్యే రోజా.

అనంతరం కేసీఆర్ కుటుంబ సభ్యులు రోజా ఇంటిలో భోజనం చేశారు. భోజనం అనంతరం రోజా కుటుంబ సభ్యులను అన్నదాత సుఖీభవ అంటూ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామితోపాటు మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు. 

అంతకుముందు కాంచీపురంలోని అత్తివరదరాజస్వామిని దర్శించుకునేందుకు సీఎం కేసీఆర్‌ కుటుంబంతోపాటు బయలుదేరారు. బేగంగపేట విమానాశ్రయం నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయంలో దిగారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా కంచి వెళ్లారు. 

మార్గమధ్యలో నగరి వద్ద ఎమ్మెల్యే రోజా స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ కుటుంబంతోపాటే రోజా కూడా అత్తివరదరాజస్వామిని దర్శించుకున్నారు. 40 ఏళ్లకోసారి 40 రోజులపాటు దర్శనభాగ్యం కలిగించే అత్తి వరదరాజ పెరుమాళ్‌ను సందర్శించుకున్నారు.

అనంతరం తిరుగుప్రయణంలో మార్గమధ్యంలోని నగరిలో ఆగారు. తన సతీమణి శోభ, కుమార్తె కవితతో కలిసి రోజా నివాసానికి కేసీఆర్‌ వెళ్లారు. అక్కడ భోజనం చేశారు. అనంతరం అక్కడ నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. 

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలతోపాటు టీడీపీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డిలు కేసీఆర్ కుటుంబ సభ్యులకు రేణిగుంట విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు.  
 

ఈ వార్తలు కూడా చదవండి

రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం : జగన్ కు అండగా ఉంటానన్న కేసీఆర్

రోజా ఇంటికి తెలంగాణ సీఎం కేసీఆర్: ఘన స్వాగతం పలికిన ఫైర్ బ్రాండ్

కేసీఆర్‌‌ కు రోజా ఘన స్వాగతం(వీడియో)

నగరిలో కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే రోజా

కొద్దిసేపట్లో ఎమ్మెల్యే రోజా ఇంటికి కేసీఆర్.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

అప్పట్లో కేసీఆర్ పై రోజా బార్, దర్బార్ వ్యాఖ్యలు: ఇప్పుడు వేచి ఉండి స్వాగతం