ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసుకు సంబంధించి దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే నందిగామ  పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాగా.. ఈ కేసులో కీలకంగా మారిన జయరాం మేనకోడలు శిఖా చౌదరిని పోలీసులు శనివారం హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

జయరాం హత్యకి శిఖా చౌదరి హస్తం ఉందనే అనుమానంతో పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. జయరాం హత్య జరిగిన తర్వాత నుంచి శిఖా చౌదరి కనిపించకుండా పోయారు. కాగా.. ఎట్టకేలకు ఆమె ఆచూకీని పోలీసులు కనుక్కోగలిగారు. ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో శిఖా చౌదరిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని ఐతవరం రోడ్డు పక్కన శుక్రవారం తెల్లవారు జామున జయరాం శవమై కనిపించిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయనది ప్రమాదం కాదని హత్యని నిర్దారించిన పోలీసులు.. నిందితులు ఎవరనేదానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

read more news

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

చిగురుపాటి హత్య: డ్రైవర్ ట్విస్ట్, ఇంటి సిసీటీవీ ఫుటేజీల పరిశీలన

జయరామ్ మర్డర్ కేసు: మేన కోడలును విచారించనున్న పోలీసులు

పరారీలో డ్రైవర్, విషప్రయోగం చేశారా: జయరామ్‌ మృతిలో అనుమానాలు

కారులో పారిశ్రామికవేత్త జయరామ్ శవం: హత్యగా అనుమానాలు (వీడియో)

నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు