ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసుకి సంబంధించి కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులకు రాకేష్ తో శిఖా చౌదరికి డబ్బుల విషయంలో  విభేదాలు ఉన్నట్లు తెలిసింది. ఎవరీ రాకేష్ అని ఆరా తీయగా.. కొన్ని విషయాలు వెలుగు చూశాయి.

రాకేష్ అనే వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం జయరాం మేనకోడలు శిఖా చౌదరికి రూ.4.5కోట్లు అప్పు ఇచ్చినట్లు సమాచారం. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి  ఇవ్వాలంటూ.. రాకేష్ తరచూ శిఖా చౌదరి ఇంటి వద్దకు వచ్చి గొడవ పడినట్లు తెలుస్తోంది. కాగా.. మేనకోడలు ఇవ్వాల్సిన డబ్బును తాను ఇస్తానంటూ జయరాం రాకేష్ కి మాట కూడా ఇచ్చారట. ఈ వ్యవహారం తేలకముందే.. జయరాం శవమై తేలాడు. 

కాగా.. జయరాం హత్యకి, ఈ డబ్బు వ్యవహారానికి ఏదైనా సంబంధం ఉందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని ఐతవరం రోడ్డు పక్కన శుక్రవారం తెల్లవారు జామున జయరాం శవమై కనిపించిన సంగతి తెలిసిందే. 

read more news

పోలీసుల అదుపులో జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి?

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

చిగురుపాటి హత్య: డ్రైవర్ ట్విస్ట్, ఇంటి సిసీటీవీ ఫుటేజీల పరిశీలన

జయరామ్ మర్డర్ కేసు: మేన కోడలును విచారించనున్న పోలీసులు

పరారీలో డ్రైవర్, విషప్రయోగం చేశారా: జయరామ్‌ మృతిలో అనుమానాలు

కారులో పారిశ్రామికవేత్త జయరామ్ శవం: హత్యగా అనుమానాలు (వీడియో)

నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు