జనసేన అధినేత పవన్ కళ్యాన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ లోని ఓ వాహనాన్ని వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న కారుకు అతి సమీపంలో జరిగింది. అయితే ఈ ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కు ఎలాంటి హాని జరగలేదు. ఆయన సురక్షితంగా బైటపడ్డారు. 

ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ రాజానగరం బహిరంగ సభలో పాల్గొనేందుకు కాకినాడ నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ  ఢీకొట్టిన కారులో పవన్ కళ్యాణ్ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ప్రయాణిస్తున్నారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఈ ప్రమాదంలో ఏడుగురు సెక్యూరిటీ సిబ్బంది గాయపడినట్లు తెలుస్తోంది. అందరికీ చిన్నచిన్న గాయలే అయ్యాయని....ఎవరికీ ప్రాణాపాయం లేదని సమాచారం. దీంతో పవన్ కళ్యాణ్ తో పాటు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం

సీఎంకు సిగ్గులేదు, ప్రతిపక్షనేతకు దమ్ములేదు:పవన్ కళ్యాణ్

జగన్ పై పవన్ ‘మగతనం’ కామెంట్స్

ఎన్టీఆర్ మాదిరిగా మంచోడిని కాను: బాబుపై పవన్ నిప్పులు

చంద్రబాబు ప్రభుత్వాన్ని సాయం కోరిన పవన్ కల్యాణ్

ఓట్ల కోసం కాదు..సాయం చేసేందుకే వచ్చా: శ్రీకాకుళంలో పవన్