పెద్దాపురం: తాను ఎన్టీఆర్ మాదిరిగా మంచివాడిని కానని... తనకు వెన్నుపోటు పొడిస్తే  రోడు మీద చొక్కా పట్టుకొని నిలదీస్తానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబుపై  సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజా పోరాట యాత్రలో భాగంగా మంగళవారం నాడు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఆయన  ప్రసంగించారు.  ఏపీ సీఎం చంద్రబాబుపై  తీవ్ర విమర్శలు గుప్పించారు.  ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబునాయుడు  హామీలిస్తారని... అధికారంలోకి రాగానే హమీలను విస్మరిస్తారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు.

తన మామనే చంద్రబాబునాయుడు దెబ్బకొట్టిన వ్యక్తి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను కూడ వాడుకొని చంద్రబాబునాయుడు వదిలేస్తారని ఎప్పుడో తెలుసునని దుయ్యబట్టారు.

తనను వెన్నుపోటు పొడిస్తే  తానేమీ ఎన్టీఆర్ అంత మంచివాడిని కాదని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎన్టీఆర్ అంత మంచిగా ఉండను... రోడ్డు మీద చొక్కా పట్టుకొని బాబును నిలదీస్తా అంటూ పవన్ హెచ్చరించారు. పేకాట క్లబ్బులు నడిపే వారికి ఎమ్మెల్యే పదవులు ఎందుకని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

 

కేంద్రానికి లేఖ రాశా, ఇవిగో ఆధారాలు:చంద్రబాబుకు పవన్ కౌంటర్

కుల రాజకీయాలు చేసే పార్టీ కాదు,కులాలను కలిపే పార్టీ జనసేన:పవన్

నేను ఏడిస్తే సమస్య పరిష్కారం కాదు: తిత్లీపై బాబుకు పవన్ కౌంటర్

చంద్రబాబు ప్రభుత్వాన్ని సాయం కోరిన పవన్ కల్యాణ్

ఓట్ల కోసం కాదు..సాయం చేసేందుకే వచ్చా: శ్రీకాకుళంలో పవన్