న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ను పచ్చి నెత్తురు తాగే వ్యక్తిగా ఆయన అభివర్ణించారు. వాళ్లు ఆడుతున్నది జగన్నాటకమని ఆయన శనివారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. 

జగన్నాటకంపై పురాణాల్లో చెప్పారని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని కేశినేని నాని అన్నారు. అనేక కేసుల్లో ఏ-1 ముద్దాయిగా ఉన్న జగన్‌ కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. జగన్నాటకం ఫ్లాప్‌ అయ్యిందని అన్నారు. పెద్ద గాయమే అయితే విశాఖలో చికిత్స చేయించుకోకుండా విమానం ఎక్కి హైదరాబాద్‌ ఎందుకు వెళ్లారని ఆయన అడిగారు.

తమ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారని టీడీపి మరో ఎంపీ కొనకళ్ల నారాయణ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని వైసీపీ, జనసేన కలిసి కుట్ర చేస్తున్నాయని ఆయన శనివారం మీడియా సమావేశంలో మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని కొనకళ్ల అన్నారు. 

బెదిరింపులకు భయపడేదిలేదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. గవర్నర్‌ నరసింహన్‌ కేంద్రం ఏజెంట్‌గా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

హైదరాబాదులో జగన్ కు చికిత్స: చంద్రబాబు యూటర్న్

ఎపి పోలీసులపై వ్యాఖ్య: జగన్ నష్టనివారణ చర్యలు

జగన్నాటకం రక్తికట్టలేదు, రాష్ట్రపతి పాలనకు కుట్ర:గంటా

నేను చెప్పాలనుకున్నదే లేఖలో రాశా...అది చూసుకోండి: నిందితుడు శ్రీనివాస్

కోర్టుకు శ్రీనివాస్, 9ఫోన్ లు ఒకే సిమ్, మరోకత్తి స్వాధీనం :జగన్ కేసుపై విశాఖ సీపీ లడ్డా

పవన్ కళ్యాణ్ పై దాడికి కుట్ర:కన్నా సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

జగన్ "కేంద్రం"గా చంద్రబాబు రాజకీయం

ఆపరేషన్ గరుడ నమ్మాల్సి వస్తే శివాజీని ప్రశ్నించండి:టీడీపీకి రోజా కౌంటర్

జగన్ పై దాడి: లేఖ మడతలు పడలేదు, ఒక్కో పేజీలో ఒక్కో రాత