జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు తరపున ఈ కేసు వాదించేందుకు సలీం అనే లాయర్ ముందుకొచ్చారు. శ్రీనివాసరావు ను ఇవాళ సాయంత్రం కలిసి ఈ విషయం గురించి మాట్లాడతానని  సలీం తెలిపారు. అలాగే నిందుతుల విచారణ లాయర్ సమక్షంలో జరగాలని గుర్తు చేసిన ఆయన ఇకనుంచి శ్రీనివాస్ విచారించేటపుడు తాను కూడా ఉంటానని పేర్కొన్నారు.

జగన్ పై దాడి చేసిన తర్వాత నిందుతున్ని అదుపులోకి తీసుకున్న ఎయిర్ పోర్టు పోలీసులు అదే పీఎస్ లో ఉంచారు. అయితే కోర్టు అనుమతితో సిట్ పోలీసులు శ్రీనివాస్ ను 6 రోజులు విచారించారు. ఇటీవలే ఈ గడువు ముగియడంతో కోర్టు నిందితుడికి 14  రోజుల రిమాండ్ పొడిగించింది. దీంతో పోలీసులు శ్రీనివాస్ ను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. 

ఈ కేసులో పోలీసులు పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారించినా అతడి  నుండి సహకారం అందలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో అతడి కాల్ డేటా, సిసి పుటేజి ఆధారంగాదర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని  వార్తలు

జగన్‌పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ