దాదాపు లోక్ సత్తా పార్టీ బాధ్యతలు చేపట్టారనే అందరూ భావించారు. సడెన్ గా ఇలా మళ్లీ పార్టీ పెడతాను అని ప్రకటించడంతో.. జయప్రకాశ్ నారాయణతో ఏదైనా చెడిందా.. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ యూటర్న్ తీసుకున్నారు. తాను సొంతంగా కొత్త పార్టీ పెడుతున్నట్లు తాజాగా ఆయన ప్రకటించడం విశేషం. అధికారికంగా ఇందుకు సంబంధించి ప్రకటన కూడా విడుదల చేశారు. రెండు రోజుల క్రితం లక్ష్మీనారాయణ.. లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణతో సమావేశమైన సంగతి తెలిసిందే. దీంతో.. ఆయన ఆయన లోక్ సత్తాలో చేరానని.. ఆ పార్టీ బాధ్యతలు స్వీకరించారనే ప్రచారం మొదలైంది.
కాగా.. ఆ ప్రచారానికి స్వస్తి పలుకుతూ.. తాను కొత్త పార్టీ పెడతానని ప్రకటించడం విశేషం. పార్టీ ప్రారంభ తేదీ, ప్రదేశం, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తానని ఆయన తెలిపారు.
స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన అంనంతరం ఏపీలో ప్రజాసమస్యల పట్ల ప్రత్యేక దృష్టిసారించిన ఆయన... కొత్త పార్టీ పెడతారా? లేక ఏదో ఒక పార్టీలో చేరతారా? అనే దానిపై కొద్ది రోజుల నుంచి ఉత్కంఠ నెలకొంది. దాదాపు లోక్ సత్తా పార్టీ బాధ్యతలు చేపట్టారనే అందరూ భావించారు. సడెన్ గా ఇలా మళ్లీ పార్టీ పెడతాను అని ప్రకటించడంతో.. జయప్రకాశ్ నారాయణతో ఏదైనా చెడిందా.. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
1990లో మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఎంపికైన లక్ష్మీనారాయణ.. సీబీఐ జేడీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలకమైన కేసుల్లో ఆయన దర్యాప్తు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసు, సత్యం కంప్యూటర్స్, గాలి జనార్దన్‌రెడ్డి అక్రమాలపై కేసులను దర్యాప్తు చేసి సంచలన సృష్టించారు.
read more news
జగన్ పై దాడి ప్రభుత్వ వైఫల్యం.. మాజీ జేడీ లక్ష్మీనారాయణ
లోక్ సత్తా పార్టీలో చేరిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ
కొత్త పార్టీ కాదు.. లోక్‌సత్తా అధినేతగా జేడీ లక్ష్మీనారాయణ..?
రాజకీయాల్లోకి జేడీ లక్ష్మీనారాయణ...26న పార్టీ ప్రకటన
కేసీఆర్ పై మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తల వర్షం
జనసేనలోకి జేడీ లక్ష్మీనారాయణ .. ఆగస్ట్ 14న ముహూర్తం ?
లక్ష్మీనారాయణ కొత్త పార్టీ: ‘‘జేడీ’’ కలిసొచ్చేలా.. పార్టీ పేరులోనూ ‘‘జేడీ’’
