రావాలనుకుంటే కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తా: సీబీఐ మాజీ జేడీ

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 3, Sep 2018, 11:29 AM IST
ex cbi jd on political entry
Highlights

ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయాల్లోకి రావాల్సి వస్తే కచ్చితంగా వస్తాని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. మద్యం, కులం, డబ్బు రాజకీయాలు పారద్రోలేలా ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న జేడీ కడప జిల్లాలో పర్యటించారు. 
 

కడప: ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయాల్లోకి రావాల్సి వస్తే కచ్చితంగా వస్తాని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. మద్యం, కులం, డబ్బు రాజకీయాలు పారద్రోలేలా ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న జేడీ కడప జిల్లాలో పర్యటించారు. 

ఈ సందర్భంగా ప్రజల్లో రాజకీయ చైతన్యం రావాలని అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందన్నారు. విభజన హామీల అమలు కోసం పోరాడతామని లక్ష్మీనారాయణ తెలిపారు. వ్యవసాయ, చేనేత కార్మికుల కోసం మేనిఫెస్టో రూపొందిస్తామని చెప్పారు. కౌలు రైతులకు కూడా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. 

loader