ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు.
ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. సోమవారం ఆయన లోక్ సత్తా పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పలు విషయాలపై స్పష్టతనిచ్చారు.
తాను రెడీ చేసిన పీపుల్స్ మేనిఫెస్టో ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నట్లు చెప్పారు. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ఎన్నికలకు వెళ్లడం అనేది తన నిబంధనల్లో ఒకటని చెప్పుకొచ్చారు. తనతో కలిసి పనిచేయడానికి ఆమ్ ఆద్మీ, లోక్ సత్తా ముందుకు వచ్చాయన్నారు.
ప్రజల్లోకి ఎలా వెళ్లామనే విషయాన్ని తరలోనే వెల్లడిస్తామని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయంతో ఉపాధి కల్పించడం తన విధివిధానాల్లో ఒకటి అని చెప్పారు. వచ్చే ఏపీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుపొంది తీరతానన్నారు. తన భవిష్యత్ కార్యచరణపై త్వరలోనే ఓ ప్రకటన చేస్తానని చెప్పారు.
సమాజంలో మార్పుకోసం ప్రయత్నించడం తప్పుకాదని...నిజాయితీగా ప్రయత్నం చేస్తే విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. ఇటీవల విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై జరిగిన దాడిపై కూడా ఆయన స్పందించారు. జగన్ పై దాడి ఏపీ ప్రభుత్వ వైఫల్యమన్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
read more news
లోక్ సత్తా పార్టీలో చేరిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ
కొత్త పార్టీ కాదు.. లోక్‌సత్తా అధినేతగా జేడీ లక్ష్మీనారాయణ..?
రాజకీయాల్లోకి జేడీ లక్ష్మీనారాయణ...26న పార్టీ ప్రకటన
కేసీఆర్ పై మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తల వర్షం
జనసేనలోకి జేడీ లక్ష్మీనారాయణ .. ఆగస్ట్ 14న ముహూర్తం ?
లక్ష్మీనారాయణ కొత్త పార్టీ: ‘‘జేడీ’’ కలిసొచ్చేలా.. పార్టీ పేరులోనూ ‘‘జేడీ’’
