తిరుపతి: ఎస్వీ మెడికల్ కాలేజీ ముగ్గురు ప్రోఫెసర్ల లైంగిక వేధింపుల వల్లే డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు పాల్పడిందని సీఐడీ తేల్చింది.  ఈ మేరకు సీఐడీ ఎస్పీ అమ్మిరెడ్డి  నివేదిక వివరాలను మీడియాకు వివరించారు.

ఈ ఏడాది ఆగష్టు 7వ తేదీన తన ఇంట్లో శిల్ప ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది.ఈ ఆత్మహత్య ఘటనపై డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.ఈ ఆందోళనపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడి విచారణను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

డాక్టర్ శిల్పను  ముగ్గురు ప్రోఫెసర్లు  రవికుమార్, శశికుమార్, కిరీటీ లైంగికంగా వేధింపులకు గురిచేశారని సీఐడీ నివేదిక తేల్చింది.ఈ  కేసులో  నిందితులు జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం నిందితులు ప్రయత్నిస్తున్నారు.

లైంగిక వేధింపులకు సహకరించనందును డాక్టర్ శిల్పను ఎండీ పరీక్షల్లో ఫెయిల్ చేశారని ఈ నివేదిక తేల్చింది.  ఈ ఘటనకు సంబంధించి 47 మందిని విచారించారు. ఈ విచారించినట్టు సీఐడీ తెలిపింది.

తనను ప్రోఫెసర్లు లైంగికంగా వేధిస్తున్నారని డాక్టర్ శిల్ప గవర్నర్‌కు, ప్రభుత్వానికి ఈ ఏడాది ఏప్రిల్‌ 16వ తేదీన ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణ  చేసి బాధ్యులపై చర్యలు తీసుకొంటే డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకొనేది కాదని డాక్టర్ శిల్ప  కుటుంబసభ్యులు  ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

డాక్టర్ శిల్ప సూసైడ్: బాబుకు చిత్తూరు కలెక్టర్ నివేదిక

:డాక్టర్ శిల్ప సూసైడ్: షాకింగ్ విషయాలను బయటపెట్టిన పేరేంట్స్

డాక్టర్ శిల్ప సూసైడ్: 'ఆ నివేదిక ఆలస్యానికి బాధ్యులపై చర్యలకు డిమాండ్'

డాక్టర్ శిల్ప సూసైడ్: అట్టుడుకుతున్న ఎస్వీ మెడికల్ కాలేజీ

డాక్టర్ శిల్ప సూసైడ్: సీఐడీ విచారణ షురూ, కొనసాగుతున్న ఆందోళన

డాక్టర్ శిల్ప ఆత్మహత్య: ఆ నివేదికలో ఏముంది?

డాక్టర్ శిల్ప సూసైడ్: డాక్టర్ రవికుమార్‌పై వేటు, మరో ఇద్దరిపై చర్యలకు డిమాండ్

డ్యూటీకి రావాలంటే భయంగా ఉంది: ఆత్మహత్యకు ముందు డాక్టర్ శిల్ప

డాక్టర్ శిల్ప సూసైడ్: ఆ నివేదిక ఏమైంది, ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత