తిరుపతి: ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రమణయ్యను తొలగించడంపై  ప్రోఫెసర్లు, ప్రభుత్వ డాక్టర్లు  ఆందోళన చెందుతున్నారు. రమణయ్యను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  రమణయ్యను విధుల్లోకి తీసుకోకపోతే  సమ్మెలోకి దిగుతామని ప్రభుత్వ డాక్టర్లు చెబుతున్నారు. మరో వైపు డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసులో జూడాల ఆందోళన కొనసాగుతోంది. 

చిత్తూరు జిల్లాలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో  లైంగిక వేధింపులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన డాక్టర్ శిల్ప ఈ నెల 3వ తేదీన తన నివాసంలోనే  ఆత్మహత్యకు పాల్పడింది. శిల్ప ఆత్మహత్యకు కారణమైన  ప్రోఫెసర్లు, పీడియాట్రిక్ విభాగం హెచ్ఓడీపై చర్యలు తీసుకోవాలని జాడాలు ఆందోళన కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనను సీరియస్‌గా తీసుకొన్న ఏపీ సర్కార్  డాక్టర్ రవికుమార్‌పై వేటు వేసింది. డాక్టర్ కిరీటీ, డాక్టర్ శివకుమార్‌లను బదిలీ చేసింది. ఈ వ్యవహరంలో ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రిన్నిపాల్ రమణయ్యను తొలగించింది.

ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా ఉన్న రమణయ్యను తొలగించడంపై  ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్, ప్రోఫెసర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసులో  విచారణ సాగుతున్నందున ఈ విచారణలో రమణయ్య తప్పుందని తేలితే  రమణయ్యపై చర్యలు తీసుకోవచ్చని  ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్, ప్రోఫెసర్లు  అభిప్రాయపడుతున్నారు.

ఈ విషయమై భావోద్వేగాల కారణంగా ప్రిన్సిపాల్‌ను తొలగించడం సరైందికాదన్నారు. ప్రిన్సిపాల్ ను తొలగించం సరైందికాదన్నారు.  ఈ విషయమై  ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్  శుక్రవారం నాడు అత్యవసరంగా సమావేశాన్ని నిర్వహించనుంది.ఈ సమావేశంలో  భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది.

మరో  వైపు ప్రిన్సిపాల్‌ను విధుల్లోకి తీసుకొంటే  తాము ఆందోళనను ఉధృతం చేస్తామని జూడాలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ డాక్లర్ల అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారనేది ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.

తనను లైంగికంగా వేధింపులకు గురిచేశారని  ఆరు మాసాల క్రితం డాక్టర్ శిల్ప రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ అధికారులు విచారణ నిర్వహించారు.మరోవైపు జిల్లా కలెక్టర్ ఆర్డీఓ నేతృత్వంలో కూడ కమిటీని ఏర్పాటు చేశారు.

అయితే ఈ కమిటీల నివేదికలు ఏమయ్యాయనే విషయాన్ని జూడాలు ప్రశ్నిస్తున్నారు. ఈ నివేదికను ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలని కోరుతున్నారు. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకొంటే డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకొనేది కాదని ఆమె భర్త రూపేష్ రెడ్డి, జూడాలు అభిప్రాయపడుతున్నారు. 

ఈ వార్తలు చదవండి:డాక్టర్ శిల్ప సూసైడ్: సీఐడీ విచారణ షురూ, కొనసాగుతున్న ఆందోళన

డాక్టర్ శిల్ప ఆత్మహత్య: ఆ నివేదికలో ఏముంది?

డాక్టర్ శిల్ప సూసైడ్: డాక్టర్ రవికుమార్‌పై వేటు, మరో ఇద్దరిపై చర్యలకు డిమాండ్

డాక్టర్ శిల్ప సూసైడ్: ఆ నివేదిక ఏమైంది, ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

డ్యూటీకి రావాలంటే భయంగా ఉంది: ఆత్మహత్యకు ముందు డాక్టర్ శిల్ప