అమరావతి: డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసు విషయమై ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు  చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న శుక్రవారం నాడు నివేదికను అందించారు.

ఈ నెల 3వ తేదీన డాక్టర్ శిల్ప  తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై విచారణ కోరుతూ జూడాలు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌ అయింది.హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది.  మరోవైపు సీఐడీ విచారణకు ఆదేశించింది.

డాక్టర్ శిల్ప వ్యవహరంపై ఎస్వీ మెడికల్ కాలేజీలో చోటు చేసుకొంటున్న పరిణామాల నేపథ్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్  ప్రద్యుమ్న శుక్రవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబుకు ఈ ఘటనకు సంబంధించిన నివేదికను అందించారు. అయితే ఈ ఘటనపై సీఐడీ విచారణను పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నను ఆదేశించారు. 

డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకొన్న తర్వాత డాక్టర్ రవికుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. మరో ఇద్దరు డాక్టర్లను బదిలీ చేశారు. ప్రిన్సిపాల్ రమణయ్యను తొలగించారు. ఈ విషయమై  ముందుగానే చర్యలు తీసుకొంటే డాక్టర్ శిల్ప బతికి ఉండేదని కుటుంసభ్యులు ఆభిప్రాయపడుతున్నారు.

ఈ వార్తలు చదవండి:డాక్టర్ శిల్ప సూసైడ్: షాకింగ్ విషయాలను బయటపెట్టిన పేరేంట్స్

డాక్టర్ శిల్ప సూసైడ్: 'ఆ నివేదిక ఆలస్యానికి బాధ్యులపై చర్యలకు డిమాండ్'

డాక్టర్ శిల్ప సూసైడ్: అట్టుడుకుతున్న ఎస్వీ మెడికల్ కాలేజీ

డాక్టర్ శిల్ప సూసైడ్: సీఐడీ విచారణ షురూ, కొనసాగుతున్న ఆందోళన

డాక్టర్ శిల్ప ఆత్మహత్య: ఆ నివేదికలో ఏముంది?

డాక్టర్ శిల్ప సూసైడ్: డాక్టర్ రవికుమార్‌పై వేటు, మరో ఇద్దరిపై చర్యలకు డిమాండ్

డ్యూటీకి రావాలంటే భయంగా ఉంది: ఆత్మహత్యకు ముందు డాక్టర్ శిల్ప

డాక్టర్ శిల్ప సూసైడ్: ఆ నివేదిక ఏమైంది, ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత