చిత్తూరు: లేడీ డాక్టర్  శిల్ప మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ  ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చాంబర్  ఎదుట వైద్య విద్యార్థులు  మంగళవారం నాడు  ధర్నా నిర్వహించారు. శిల్ప ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలుసుకొన్న విషయం  నుండి విద్యార్థులు  ప్రిన్పిపాల్ చాంబర్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు.మరో వైపు రుయా ఆసుపత్రి  ఎదుట శిల్ప బంధువులు ధర్నా నిర్వహిస్తున్నారు. దీంతో తిరుపతిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 

పీడీయాట్రిక్ హెచ్‌ఓడీతో పాటు మరో ఇద్దరు ప్రోఫెసర్లు తనపై వేధింపులకు పాల్పడినా  వారిపై చర్యలు  తీసుకోలేదు.దీనికితోడు  శిల్ప మానసిక స్థితి బాగా లేదనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని  శిల్ప  మానసిక క్షోభను అనుభవించినట్టు  ఆమె సన్నిహితులు చెప్పారు.

రుయా ఆసుపత్రిలో కొనసాగుతున్న లైంగిక వేధింపుల ఘటనపై శిల్ప ఫిర్యాదుపై  ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైద్యులు  విచారణ నిర్వహించారు. ఈ నివేదికను ఇంకా బయటపెట్టలేదు.ఈ నివేదికను బయటపెట్టాలని శిల్ప మరణించిన విషయం తెలుసుకొన్న తోటి డాక్టర్లు మంగళవారం ఉదయం పూట ప్రిన్సిపాల్ చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు.

అయితే శిల్ప విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు  డాక్టర్లు సెలవుపై వెళ్లారని సమాచారం. ఈ ముగ్గురు సెలవుపై వెళ్లడానికి కారణాలు ఏమిటనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.అయితే శిల్ప ఇచ్చిన ఫిర్యాదుపై  నివేదికపై ఏం చర్యలు తీసుకొన్నారు,  ఎందుకు ఈ నివేదికను బయటపెట్టలేదో చెప్పాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. 

పీడీయాట్రిక్ హెచ్ ఓ డీతో పాటు మరో ఇద్దరు ప్రోఫెసర్లపై  చర్యలు తీసుకోవాలని  వైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అత్యవసర సేవలను కూడ బహిష్కరించారు. మరోవైపు లైంగిక వేధింపులపై  తాను ఫిర్యాదు చేయడంతో  తనపై కక్షకట్టి పీజీ పరీక్షల్లో ఫెయిల్ చేసినట్టు బాధితురాలు సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాదు తన మానసిక పరిస్థితి కూడ సరిగా లేదని  కూడ  ప్రోఫెసర్లు  తప్పుడు ప్రచారం చేయడంపై కూడ ఆమె మరింత కుంగిపోయిందని సమాచారం. శిల్ప మృతిపై ఆమె సన్నిహితులు, తోటి డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎస్వీ కాలేజీ  ప్రిన్సిపాల్  చాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే రుయా ఆసుపత్రి వద్ద శిల్ప  బంధువులు ఆందోళనకు దిగారు.

ఈ వార్తలు చదవండి:డ్యూటీకి రావాలంటే భయంగా ఉంది: ఆత్మహత్యకు ముందు డాక్టర్ శిల్ప

                             షాక్: లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన డాక్టర్ శిల్ప ఆత్మహత్య