డాక్టర్ శిల్ప సూసైడ్: డాక్టర్ రవికుమార్‌పై వేటు, మరో ఇద్దరిపై చర్యలకు డిమాండ్

doctor shilpa suicide: DME suspends doctor Ravikumar
Highlights

డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఘటనకు సంబంధించిన కేసులో  ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ రవికుమార్‌‌పై మంగళవారం నాడు  డీఎంఈ వేటు వేశారు. ఆయనను విధుల నుండి తప్పించారు.

తిరుపతి: డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఘటనకు సంబంధించిన కేసులో  ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ రవికుమార్‌‌పై మంగళవారం నాడు  డీఎంఈ వేటు వేశారు. ఆయనను విధుల నుండి తప్పించారు. అయితే మరో ఇద్దరు ప్రోఫెసర్లపై కూడ  చర్యలు తీసుకోవాలని  వైద్యులు  డిమాండ్ చేస్తున్నారు.
డాక్టర్ కిరీటీ, శివకుమార్ లపై

తనపై ప్రోఫెసర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. గవర్నర్ ఈ విషయమై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.ఈ విచారణకు సంబంధించిన నివేదికను ఇంతవరకు బయటపెట్టలేదు. 

పీజీ పరీక్షల్లో శిల్ప  ఫెయిలైంది. లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి గవర్నర్‌కు ఫిర్యాదు చేసినందునే తనను కక్షగట్టి పీజీ పరీక్షల్లో ఫెయిల్ చేశారని మృతురాలు తన సన్నిహితుల ఆవేదన వ్యక్తం చేసింది.

అయితే ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున శిల్ప ఆత్మహత్య చేసుకొంది.ఈ ఆత్మహత్యకు కారణమైన ప్రోఫెసర్లపై చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చాంబర్ ఎదుట ధర్నాకు దిగారు. 

జూడాల ఆందోళన నేపథ్యంలో  డాక్టర్ రవికుమార్‌పై వేటు వేస్తూ డీఎంఈ నిర్ణయం తీసుకొన్నారు. ఒక్క రవికుమార్ ‌పై చర్యలు తీసుకోవడంపై జూడాలు  పెదవి విరుస్తున్నారు. డాక్టర్ రవికుమార్ తో పాటు డాక్టర్ కిరిటీ, డాక్టర్ శివకుమార్‌పై కూడ చర్యలు తీసుకోవాలని  జూడాలు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. 

ఈ వార్తలు చదవండి: డాక్టర్ శిల్ప సూసైడ్: ఆ నివేదిక ఏమైంది, ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

                                 డ్యూటీకి రావాలంటే భయంగా ఉంది: ఆత్మహత్యకు ముందు డాక్టర్ శిల్ప

                                 షాక్: లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన డాక్టర్ శిల్ప ఆత్మహత్య

 

loader