Asianet News TeluguAsianet News Telugu

డాక్టర్ శిల్ప ఆత్మహత్య: ఆ నివేదికలో ఏముంది?

తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రోఫెసర్లపై ఫిర్యాదు చేసినా  పట్టించుకోకపోవడంతో డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకొన్నారు. అయితే శిల్ప చేసిన ఫిర్యాదు మేరకు  విచారణ నిర్వహించిన కమిటీ ఇచ్చిన నివేదిక ఏమైంది.

doctor shilpa suicide:why narsareddy committee not revealed its report

తిరుపతి: తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రోఫెసర్లపై ఫిర్యాదు చేసినా  పట్టించుకోకపోవడంతో డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకొన్నారు. అయితే శిల్ప చేసిన ఫిర్యాదు మేరకు  విచారణ నిర్వహించిన కమిటీ ఇచ్చిన నివేదిక ఏమైంది. ఆ నివేదిక ఇవ్వడానికి ఎందుకు ఆలస్యమైంది. ఈ ఆలస్యం వల్లే శిల్ప ఆత్మహత్యకు పాల్పడిందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

చిత్తూరు జిల్లా పీలేరులో డాక్టర్ శిల్ప మూడు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. శిల్ప ఆత్మహత్యపై జాడాలు ఆందోళన చేశారు. లైంగిక వేధింపులపై  శిల్ప  ఇచ్చిన ఫిర్యాదుపై కమిటీ ఇచ్చిన నివేదిక  ఎందుకు ఆలస్యమైందని జూడాలు ప్రశ్నిస్తున్నారు.

డాక్టర్ రూపేష్‌రెడ్డిని శిల్ప ప్రేమించి పెళ్లి చేసుకొంది. రూపేష్‌రెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్‌గా పనిచేస్తున్నారు. డాక్టర్ పీడియాట్రిక్ విభాగంలో పనిచేస్తున్నారు.  ఈ దంపతులకు  మూడేళ్ల  రిషి అనే కొడుకు ఉన్నాడు. 

ఆరు మాసాల క్రితం తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని  ఆరోపిస్తూ డాక్టర్ శిల్ప రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. అంతకు ముందు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఈ ఫిర్యాదుపై ప్రిన్సిపాల్‌ పట్టించుకోకపోవడం వల్లే  గవర్నర్‌కు బాధితురాలు  ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై ఏర్పాటు చేసిన  విచారణ కమిటీ  నివేదిక ఇవ్వడంలో జాప్యం చోటు చేసుకొంది. 

చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్‌ రవికుమార్‌, మరో ఇద్దరు ప్రొఫెసర్లు డాక్టర్‌ కిరీటి, డాక్టర్‌ శశికుమార్‌ నన్ను అసభ్య పదజాలం, మురికి మాటలతో లైంగికంగా వేధిస్తున్నారు. అక్కడ ఏమాత్రం విద్యార్థి-ఉపాధ్యాయుల మధ్య ఉండే సంబంధం లేదు. 

నాతోపాటు చాలామంది ఇదే ఒత్తిడిలో ఉన్నారు. అయితే ప్రాక్టికల్‌ మార్కులు వీరి చేతిలో ఉండడం వల్ల వీరికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేక పోతున్నారు. పలుమార్లు వీరిపై అనేక ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదు.

 నేను ఒక వివాహితురాలిగా వారి వేధింపులు తట్టుకోలేక యాంటీబయాటీక్స్‌ మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించా. త్వరలో జరగనున్న పరీక్షల్లో నన్ను ఫెయిల్‌ చేసేందుకు వీరు సిద్ధమయ్యారు. 

మా టీచర్లుగా ఉండేందుకు వీరు అర్హులు కాదు. మా డ్రెస్‌లపై కామెంట్‌ చేస్తారు. చివరకు మా పీరియడ్స్‌పైనా చెప్పుకోలేని విధంగా మాట్లాడుకుంటారు. మళ్లీ చెబుతున్నా సార్‌ వీరిపై వ్యతిరేకంగా చెప్పేందుకు ఎవరూ ముందుకు రారు. ప్లీజ్‌.. న్యాయం చేయండి సార్‌...!’ అంటూ మెయిల్‌లో 
ఈ ఏడాది ఏప్రిల్‌ 3న ఆమె గవర్నర్‌ నరసింహన్‌కు ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు.ఆమె గవర్నర్‌ను వేడుకున్నారు.

దీంతో గవర్నర్‌పై ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. ఈ విచారణ నివేదిక ఏమైందని జాడాలు   ప్రశ్నిస్తున్నారు. డాక్టర్ శిల్ప మృతిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఏపీ సర్కార్ సీరియస్‌గా స్పందించింది. డీఎంఈ బాబ్జీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ డాక్టర్ శిల్ప సూసైడ్ ఘటనపై  విచారణను చేస్తోంది.

అయితే గతంలో ఏర్పాటు చేసిన కమిటీ  ఇచ్చిన నివేదికను బహిర్గతం చేస్తే  శిల్ప మరణించేది కాదని జూడాలు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన కమిటీ వల్ల ఏం ఉపయోగమని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు డాక్టర్ రవికుమా‌ర్‌పైనే చర్యలు తీసుకోవడాన్ని తప్పుబడుతున్నారు.  ఢాక్టర్ కిరీటీ, డాక్టర్ శివకుమార్‌లపై కూడ చర్యలు తీసుకోవాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు.  ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్  నిర్లిప్తత  కారణంగానే ఈ ఘటన చోటు చేసుకొందని జూడాలు అబిప్రాయపడుతున్నారు. 

పీజీ పరీక్షల్లో  ఉద్దేశ్యపూర్వకంగా  తనను ఫెయిల్ చేశారని  డాక్టర్ శిల్ప  అభిప్రాయపడింది.ఈ విషయమై  శిల్ప మరోసారి రీ వాల్యూయేషన్  కోరింది. రీవాల్యూయేషన్ కోరినా పీజీ పరీక్షల్లో అవే మార్కులు వచ్చాయి. దీంతో మానసిక ఘర్షణకు గురైన  శిల్ప మూడు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ వార్తలు చదవండి:డాక్టర్ శిల్ప సూసైడ్: డాక్టర్ రవికుమార్‌పై వేటు, మరో ఇద్దరిపై చర్యలకు డిమాండ్

డాక్టర్ శిల్ప సూసైడ్: ఆ నివేదిక ఏమైంది, ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

డ్యూటీకి రావాలంటే భయంగా ఉంది: ఆత్మహత్యకు ముందు డాక్టర్ శిల్ప

 

 

Follow Us:
Download App:
  • android
  • ios