Asianet News TeluguAsianet News Telugu

డాక్టర్ శిల్ప సూసైడ్: సీఐడీ విచారణ షురూ, కొనసాగుతున్న ఆందోళన

చిత్తూరు జిల్లా పీలేరులో డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకొన్న కేసులో  సీఐడీ విచారణ ప్రారంభమైంది. శిల్ప మృతిపై  ఏపీ సర్కార్  సీరియస్‌గా  తీసుకొంది.  ఈ విషయమై హైలెవల్  కమిటీ  ఏర్పాటు చేసింది

CID police conducts inquiry over doctor shilpa suicide


తిరుపతి:చిత్తూరు జిల్లా పీలేరులో డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకొన్న కేసులో  సీఐడీ విచారణ ప్రారంభమైంది. శిల్ప మృతిపై  ఏపీ సర్కార్  సీరియస్‌గా  తీసుకొంది.  ఈ విషయమై హైలెవల్  కమిటీ  ఏర్పాటు చేసింది. దీంతో పాటుగా  సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మూడు రోజుల క్రితం డాక్టర్ శిల్ప  తన ఇంట్లో ఆత్మహత్య చేసుకొంది.  డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు కారణమైన ప్రోఫెసర్లను కఠినంగా శిక్షించాలని ఎస్వీ మెడికల్ కాలేజీలో జూడాలు  విధులను బహిష్కరించి ఆందోళనను కొనసాగిస్తున్నారు. 

మూడు రోజుల క్రితం డాక్టర్ శిల్ప తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఆత్మహత్యకు గల కారణాలపై జూడాలు మండిపడుతున్నారు. తనపై ప్రోఫెసర్లు , హెచ్ఓడీ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని  డాక్టర్ శిల్ప ఈ ఏడాది ఏప్రిల్ లో రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదుపై  ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ విచారణ నిర్వహించింది.ఈ విచారణ నివేదిక ఇంతవరకు బయటకు రాలేదు. పీజీ పరీక్షలు రాసిన డాక్టర్ శిల్ప ఈ పరీక్షల్లో ఫెయిలైంది. డాక్టర్ శిల్పను ఉద్దేశ్యపూర్వకంగానే ఫెయిల్ చేశారని  ఆమె తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసింది.  అయితే  ఈ ఘటనల నేపథ్యంలో డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

సీఐడీ ఎస్పీ నేతృత్వంలో  ఈ కమిటీ పనిచేస్తోంది. ఒక మహిళ ఇన్స్‌పెక్టర్‌తో పాటు నలుగురు సీఐలు కూడ ఈ కమిటీలో ఉంటారు. డాక్టర్ శిల్ప మృతిపై ఎస్వీ యూనివర్శిటీలో జూడాలు ఆందోళన కొనసాగిస్తున్నారు.

ఈ ఆందోళనల నేపథ్యంలో డాక్టర్ శిల్ప మృతిపై ఏర్పాటు చేసిన  డీఎంఈ బాబ్జీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ విచారణను చేస్తోంది. మరోవైపు గురువారం నాడు సీఐడీ అధికారులు కూడ విచారణను ప్రారంభించారు. 

ఇదిలా ఉంటే డాక్టర్ శిల్ప మృతి విషయమై ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్‌ఓడీ, మరో ఇద్దరు ప్రోఫెసర్లపై నిర్భయ కేసులు నమోదు చేసి సస్పెన్షన్ వేటేయాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. 

ఈ వార్తలు చదవండి:డాక్టర్ శిల్ప ఆత్మహత్య: ఆ నివేదికలో ఏముంది?

డాక్టర్ శిల్ప సూసైడ్: డాక్టర్ రవికుమార్‌పై వేటు, మరో ఇద్దరిపై చర్యలకు డిమాండ్

డాక్టర్ శిల్ప సూసైడ్: ఆ నివేదిక ఏమైంది, ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

డ్యూటీకి రావాలంటే భయంగా ఉంది: ఆత్మహత్యకు ముందు డాక్టర్ శిల్ప

 

Follow Us:
Download App:
  • android
  • ios