అమరావతి: ప్రధాని నరేంద్రమోదీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. తాము కాంగ్రెస్ పార్టీతో కలిశామని విమర్శిస్తున్న మోదీ తమకు చేసిన నమ్మక ద్రోహంపై ఆలోచించుకోవాలని హితవు పలికారు. 

ఆంధ్రప్రదేశ్ సుపరిపాలనపై రెండో శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు ఏపీ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం శీతకన్ను వేసిందని చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టుల విషయంలో మరోసారి ప్రధాని మోదీకి, గడ్కరీకి లేఖలు రాస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. మోదీ నిధులు విడుదల చెయ్యకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు. 

తాను కాంగ్రెస్ పార్టీతో కలిస్తే మోదీ విమర్శిస్తున్నారని తాము కలిస్తే తప్పేంటని నిలదీశారు. మోదీ ఆంధ్రప్రదేశ్ కు తీరని ద్రోహం చేశారని తమకు నమ్మక ద్రోహం చేశారని అలాంటి పార్టీతో ఉండాలా అంటూ నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీతో కలిశామని వివరించారు.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ చేసిన నమ్మక ద్రోహాన్ని ప్రజలు ఎవరూ క్షమించరని తెలిపారు. రాష్ట్రాల హక్కుల సాధన కోసం, రాష్ట్రాల ప్రయోజనాల కోసం తాము కాంగ్రెస్ పార్టీతో కలిశామని దాన్ని విమర్శించాల్సిన అవసరం మోదీకి లేదని చంద్రబాబు అన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

సుపరిపాలనపై రెండో శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు

పోలవరంపై వైసీపీ, టీఆర్ఎస్ ల కుట్ర: చంద్రబాబు

మోదీ ప్రధాని దేశానికా..? గుజరాత్ కా..? : చంద్రబాబు

ఏపీ అభివృద్ధికి కేసీఆర్ అడ్డుపడుతున్నాడు: చంద్రబాబు ఆగ్రహం

పోలవరం క్రస్ట్ గేట్ పనులను ప్రారంభించిన చంద్రబాబు

వాళ్లతో కుమ్మక్కై పోలవరాన్నిఅడ్డుకుంటున్న కేసీఆర్: దేవినేని