ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్‌లో మరో కీలకఘట్టం ఆవిష్కృమైంది. ప్రాజెక్ట్‌లో కీలకమైన స్పిల్ వే క్రస్టు గేట్లు బిగించే ప్రక్రియను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం ప్రారంభించారు.

40, 41 స్తంభాల మధ్య తొలి క్రస్ట్ గేట్ వద్ద పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి రేడియల్ గేట్‌ స్థాపన పనులను ప్రారంభించారు. వచ్చే మే నాటికీ గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం.

అనంతరం ఎగువన ఉన్న కాఫర్ డ్యామ్ పనులను సీఎం పరిశీలించనున్నారు. నిజానికి డిసెంబర్ 17న ఈ పనులు ప్రారంభించాలని షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ పెథాయ్ తుఫాను కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో ముఖ్యమంత్రి తన పర్యటనను వాయిదా వేశారు.