పోలవరం: తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ లతో కుమ్మక్కై పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. 

పోలవరం ప్రాజెక్టుపై నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ తనయ కవిత కోర్టుల్లో కేసులు వేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో అభివృద్ధిని అడ్డుకునేందుకు కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు.  ఒడిశా సీఎంతో కలిసి పోలవరం నిర్మాణానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని దేవినేని ఆరోపించారు. 

ఆదివారం ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ తో కేసీఆర్ భేటీ అయినప్పుడు పోలవరం ప్రాజెక్టుపై చర్చించారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును ఎవరూ అడ్డుకోవద్దని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టుపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరారు. 

ఈ వార్తలు కూడా చదవండి

మోదీ ప్రధాని దేశానికా..? గుజరాత్ కా..? : చంద్రబాబు

ఏపీ అభివృద్ధికి కేసీఆర్ అడ్డుపడుతున్నాడు: చంద్రబాబు ఆగ్రహం

పోలవరం క్రస్ట్ గేట్ పనులను ప్రారంభించిన చంద్రబాబు